సరిగ్గా ఆరు రోజుల క్రితం ఉదయం 11 గంటల సమయంలో సిగ్నల్ పొరపాటు లేదంటే మానవతప్పిదమో తెలియదుగాని, ఎంఎంటిఎస్ రైలు ఎదురుగా ఆగిఉన్న ఇంటర్ సిటీ రైలును ఢీకొట్టింది.  హద్రీనీవా రైలు పట్టాలపై ఆగి ఉన్నది.. ఎంఎంటిఎస్ రైలు సైతం కూడా స్లోగా ప్రయాణం చేస్తున్నది కాబట్టి పెద్దగా ప్రమాదం జరగలేదు.  ఈ రైలు ప్రమాదంలో రైలు లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.  ఇంజిన్ లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ ను 8 గంటలపాటు కష్టపడి బయటకు తీశారు.  


తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ ను హుటాహుటిన నాంపల్లిలోని కేర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.  కాలుకు తీవ్రంగా గాయం కావడంతో.. కాలును తొలగించారు.  అయితే, ఐదు రోజులపాటు చికిత్స పొందిన శేఖర్, నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో మరణించారు.  శేఖర్ ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేసి మరణించడంతో రైల్వే అధికారులు నివాళులు అర్పించారు.  


అయితే, సిగ్నల్స్ ను చూసుకోకుండా లోకో పైలట్ ట్రాక్ మీదకు వచ్చారని రైల్వే అధికారులు చెప్తున్నారు.  పైలట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు.  అధికారులు కావాలనే తమ కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేశారని, తప్పుగా అధికారులు సిగ్నల్స్ ఇవ్వడం వలనే ఇలా జరిగిందని వాపోతున్నారు. ఏదైతేనేం ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలట్ పై వివిధ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.  


ఈ ప్రమాదంలో వెనక బోగీల్లో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  చిన్న చిన్న గాయాలే కావడంతో పెద్దగా  ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  ఉదయం 11 సమయం కావడంతో రైలు పెద్దగా రష్ గా లేదు.  అదే పదిగంటల లోపు జరిగి ఉంటె.. ప్రమాదం తీవ్రంగా ఉండేది.  ఆ సమయంలో ఎంఎంటిఎస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి.  ఈ ప్రమాదంపై రైల్వే శాఖ సీరియస్ అయ్యింది.  ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: