దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి,  ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాతృమూర్తి, వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న "వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌" ను నేడు కేంద్రం రద్దు చేసింది. ‘విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010’ లోని సెక్షన్ 14 కింద వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక సమాచారం. అయితే ఒక్క విజయమ్మకు చెందిన చారిటబుల్ ట్రస్ట్‌ నే కాకుండా  తెలంగాణలో 90, ఏపీలో 168, ఎన్జీఓలను కేంద్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో కొన్ని చర్చిలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇది పెద్ద షాక్ తగిలినట్లేనని అంటున్నారు.  కారణం ఆయనపై ప్రధాన ప్రతిపక్షం మతపరమైన ఆరోపణలు చేస్తుంది.

వైఎస్ విజయమ్మ  చారిటబుల్ ట్రస్ట్‌ కు విదేశాల నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు చేశారనే అంశంపై "వార్షిక నివేదిక" లను చట్టపరంగా కేంద్రానికి సమర్పించడంలో విఫలమైనందుకు ఆయా ఎన్జీవోల మీద చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. 'ఫారిన్ కంట్రిభ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్' FCRA చట్టం ప్రకారం విదేశీ విరాళాల విషయంలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆయా ఎన్జీవోలు నివేదికలు సమర్పించాల్సి ఉండగా,  అలా అనుసరించక పోవటం చట్ట విరుద్ధం. 


"ఫారిన్ కంట్రిభ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ - FCRA చట్టం ప్రకారం వార్షిక నివేదికలను సమర్పించాలి. కానీ, 2017-18 సంవత్సరానికి నివేదికలు సమర్పించడంలో విఫల మయ్యాయి. రిపోర్టు సమర్పించడానికి 2019, మార్చి 31 వరకు గడువు పొడిగించినా కూడా వారు వార్షిక నివేదికను సమర్పించ లేదు. వార్షిక నివేదికలు సమర్పించకపోవడం చట్ట విరుద్ధం. అయినా, చివరిగా ఒకసారి అవకాశం కల్పించడానికి జూన్ 22న నోటీసులు ఇచ్చాం. 15 రోజుల్లో ఆదాయ - వ్యవ నివేదికలు సమర్పించాలని కోరాం. కానీ వారు దాన్ని కూడా వినియోగించుకోలేకపోయారు" అని కేంద్ర హోంశాఖ తెలిపింది.
Image result for వైఎస్ విజయమ్మ  చారిటబుల్ ట్రస్ట్‌
వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీ, రాయపాటి చారిటబుల్ ట్రస్ట్, ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి రిజిస్ట్రేషన్లను కూడా కేంద్రం రద్దు చేసింది.


ఫోరం ఫర్ గుడ్ గవర్నాన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ - FCRA తప్పని సరిగా మతసంభంద ట్రస్టులకు విదేశీ నిధులు అందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంజీఓలు స్వదేశీ నిధులను మాత్రమే స్వీకరించి, నడపబడాలని ఆయన తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: