కుటుంబ పోషణకు సౌదీ వెళ్తున్న మహిళలు చాలా ఎక్కువే. కేవలం మన దేశం నుంచే కాకుండా వేర్వేరు దేశాల నుంచి మహిళలు తమ కుటుంబ పోషణకు సౌదీ అరేబియా కు వెళ్తూ వుంటారు. వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకుని కొందరు నీచులు ఆ అమాయక మహిళలపై అఘాయాత్యాలకు ఒడికడుతున్నారు. తాజా గా ఇలాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. 


బతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ మహిళ అక్కడ తను ఎదుర్కొంటున్న నరకయాతనను వీడియో కాల్ ద్వారా వెల్లడించింది. తన యజమానులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడిన ఈ వీడియో కాల్‌లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తనని రక్షించాలని వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో లో ఉన్న మహిళా బంగ్లాదేశ్ కి చెందినది గా గుర్తించారు.


"ఇక్కడ ఎన్నాళ్లు బతకుతానో తెలీదు. దయచేసి నన్ను రక్షించండి. 15 రోజుల నుంచి వీరు నన్ను ఇంట్లో బంధించారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదు. మరిగిన నూనెలో ముంచి నా చేతులను కాల్చేశారు" అంటూ వీడియో లో మహిళా కన్నీటి పర్యంతం అయింది. వీడియో లో ఉన్న మహిళ కు 25 సంవత్సరాలు ఉంటాయి. 'నన్ను ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తిప్పుతున్నారు. మొదటి ఇంట్లో నన్ను తీవ్ర కొట్టి హింసించారు. మరో ఇంట్లో కూడా అదే చేశారు. నేను ప్రాణాలతో ఉంటానని అనుకోవడం లేదు. చనిపోతాను అనిపిస్తోంది.

ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి’ అంటూ అ మహిళ వీడియో కాల్ ను కట్ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆ మహిళ జెద్దాహ్‌లో ఉన్నట్లు గుర్తించింది. సౌదీ ప్రభుత్వం తో మాట్లాడి వీలు అయినంత తొందరలో ఆ మహిళను బంగ్లాదేశ్ తీసుకొస్తామని స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: