టెక్నాలజీ క్రమంగా అభివృద్ధి చెందుతున్నది.. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత ప్రతిదీ కూడా కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.  ఇందులో భాగంగానే విమానాలు,  జెట్ ఫ్లైట్స్, హోవర్స్, ఇలా ఎన్నో వచ్చాయి.  ఇప్పుడు కొత్తగా ఫ్లైయింగ్ టాక్సీలు రాబోతున్నాయి.  సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టుగా గాల్లోనే ఇక మనుషులు ప్రయాణం చేయబోతున్నారు. 
ఇప్పటి వరకు రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోవడంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  దాని నుంచి బయటపడే పరిష్కారమే ఈ ఫ్లైయింగ్ టాక్సీ.  దీన్ని జర్మనీకి చెందిన లిలియం వీటిని తయారు చేస్తున్నది.  చాలా కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్న ఈ సంస్థ, పూర్తిగావిద్యుత్ సహాయంతో నడిచే ఫ్లైయింగ్ టాక్సీలను తయారు చేస్తున్నారు.  
ఈ టాక్సీ రోడ్డుపై కాకుండా గాల్లోనే ప్రయాణం చేస్తుంది.  గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే విధంగా దీనిని తయారు చేస్తున్నారు.  ఐదుగురు కూర్చునే విధంగా దీనిని రూపొందిస్తున్నారు.  ఫ్లైయింగ్, ల్యాండింగ్ విభాగంలో ఈ విమానాలపై దాదాపుగా వందసార్లు ప్రయోగం చేసి విజయం సాధించింది.  ఇక ఇప్పుడు రెండో దశ నిర్మాణాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  
2025 నాటికి అన్ని దశల్లో ప్రయాగాలు సక్సెస్ చేసి, కమర్షియల్ గా వీటిని విపణిలోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.  కమర్షియల్ గా వీటిని లాంచ్ చేస్తే.. ప్రయాణం ఈజీ అవుతుందని అంటున్నారు.  త్వరలోనే అన్ని రకాల అనుమతులు తీసుకుంటామని లిలియం కంపెనీ చెప్తోంది.  కమర్షియల్ గా వీటిని లాంచింగ్ చేస్తే.. ప్రతి విషయంలో కూడా వీటిని వినియోగించుకోవచ్చని అంటున్నారు. ప్రతి సంవత్సరం వందకు పైగా ఇలాంటి టాక్సీలను తయారు చేయాలని లక్షయంగా పెట్టుకుంది.  అలానే కమర్షియల్ గా ప్రారంభించే ముందు మొదట 500 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చెప్తోంది ఈ సంస్థ.  

మరింత సమాచారం తెలుసుకోండి: