ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్రలో రైతులను ఉద్ధరిస్తామని చెప్పిన జగన్మోహ న్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక వారిని అన్నివిధాల మోసం చేశాడని, పంటఉత్పత్తులకు  గిట్టుబాటధరకూడా కల్పించలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రప్రభుత్వముందని టీడీపీ సీనియర్‌ ్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.  ఖరీఫ్‌,రబీలో 2017-18 సంవత్స రానికి గాను, 157లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడివస్తే, ఈఏడాది 2019-20  లో 151లక్షల మెట్రిక్‌టన్నులకే రాష్ట్రప్రభుత్వ అంచనాలు పరిమితమయ్యాయన్నారు. 
వ్యవసాయరంగంపై ప్రభుత్వ పోకడలు, ఆలోచనావిధానం చూస్తుంటే, పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగ ంపై ఏవిధమైన సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదని, గిట్టుబాటుధర, ఉత్పత్తుల పెంపుదల, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులు, రైతునాయకులతో ఒక్క సమావేశంకూడా నిర్వహించకపోవడం శోచనీయమని ఆలపాటి చెప్పారు. రైతుకమిషన్‌ ఏర్పాటుతో సరిపెట్టి న ప్రభుత్వం, మద్దతుధర విషయంలో ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. 
వైసీపీ అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే 281మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని,    అన్నదాతల చావులను కూడా పక్కదారి పట్టించేపనిలో ప్రభుత్వం ఉందని మాజీమంత్రి     స్పష్టంచేశారు. ధాన్యం సహా, ఇతర అపరాలపంటలైన మినుములు, పెసలు, జొన్న, మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు గిట్టుబాటుధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. వినియోగదారుడికి కొనబోతే కొరివి, రైతులకేమో అమ్మబోతే అడవి అన్నతీరుగా రాష్ట్రంలో పంటలఉత్పత్తులు ఉన్నాయన్నారు. 

మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించామన్న ప్రభుత్వం, జొన్న, మొక్కజొన్న, పసుపు, మినుము, పెసర, వేరుశనగ ధరలు పడిపోతే ఏంచర్యలు తీసుకుందని మాజీమంత్రి నిలదీశారు. నీరుఅందుబాటులోఉన్నా, సరైన వ్యవసాయ విధానం, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోవడం వల్ల రాష్ట్రవ్యవసాయ రంగం తలకిందులైందన్నారు.  రైతురుణమాఫీని రద్దుచేసి, రైతుభరోసా తీసుకొచ్చిన ప్రభుత్వం ఎంతమందికి భరోసా కల్పించిందో, ఎంతమందికి వడ్డీలేనిరుణాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలని ఆలపాటి డిమాండ్‌చేశారు. టీడీపీ ప్రభుత్వం విడుదలచేసిన 4,5 విడతల రుణమాఫీసొమ్ము రైతులకు దక్కకుండా మోకాలడ్డిన జగన్మోహన్‌రెడ్డి, రైతుభరోసా పేరుతో రూ.13,500 ఇస్తామని ఇప్పుడు కేవలం రూ.7,500లు ఇస్తూ, రైతుల్ని నిలువునా మోసగించాడన్నారు. 
కోటిమంది రైతులుంటే, కేవలం 40లక్షలమందికే అరకొరగా రైతుభరోసా అమలుచేశారని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. కౌలురైతుల్ని కూడా గుర్తించలేని గుడ్డిప్రభుత్వం, రైతుభరోసా ప్రకటనల పేరుతో కొన్ని లక్షలరూపాయల్ని దుర్వినియోగం చేసిందన్నారు. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై ఆరోపణలుచేయడం తప్ప, ఈ 6నెలల్లో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకోసం పొరుగురాష్ట్రాలకు వెళ్లమంటున్న రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రంలోని ఆసుపత్రులను ఎందుకు బాగుచేయడం లేదన్నారు?    

మరింత సమాచారం తెలుసుకోండి: