తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. నర్సంపేట్ ఆర్టీసీ డిపోకు చెందిన యాకుబ్ భాషాకు రెండు రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. యాకుబ్ కుటుంబ సభ్యులు యాకుబ్ ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ యాకుబ్ ఆస్పత్రిలో మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం ఉప్పరాపల్లి యాకుబ్ భాషా స్వస్థలం. యాకుబ్ భాషా మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 47 రోజులైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత 28 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకపోవటం వలన ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. యాకుబ్ మృతి పై యాకుబ్ కు వరుసకు కొడుకైన వ్యక్తి స్పందిస్తూ హైకోర్టు తీర్పు చూసిన తరువాత యాకుబ్ కు గుండెపోటు వచ్చిందని చెబుతున్నాడు. 
 
యాకుబ్ కుమారుడు మాట్లాడుతూ సమ్మె మొదలైన రోజు నుండి యాకుబ్ టెన్షన్ ఎక్కువగా పడేవాడని జీతాలు అందకపోవటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పాడు. యాకుబ్ ఆర్టీసీ సమ్మె వలన టెన్షన్ పడేవాడని హైకోర్టు లేబర్ కోర్టుకు వెళ్లమని తీర్పు చెప్పటంతో టీవీ చూస్తూ ఉండే సమయంలో గుండెపోటు వచ్చిందని చెప్పాడు. గతంలో యాకుబ్ కు అవార్డులు కూడా వచ్చాయని సమాచారం. 
 
ఒక ఆర్టీసీ కార్మికుడు యాకుబ్ గురించి మాట్లాడుతూ యాకుబ్ భాషా చాలా అంకిత భావంతో పని చేసేవాడని మా ఉద్యోగాలు ఉంటాయా..? ఉండవా ..? అనే టెన్షన్ తో ఆందోళనకు గురై గుండెపోటు వచ్చిందని చెబుతున్నాడు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామని ఆర్టీసీ కార్మికుడు చెబుతున్నాడు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లటం వలనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటల వలన, హైకోర్టు తీర్పు వలన ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: