తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తుది దశకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వం షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తీర్పును గౌరవించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. 
 
ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తారని ప్రకటించటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఇన్ని రోజులు సమ్మె చేసి ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. కొందరి స్వార్థానికి ఆర్టీసీ కార్మికులు బలయ్యారని 28 మంది ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సమ్మె వలన ప్రాణాలు కోల్పోయారని ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
 
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరటానికి గతంలోనే అవకాశం ఇచ్చిందని ఈ నిర్ణయం అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటే లాభం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోకపోతే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రజల నుండి జేఏసీ నాయకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోమని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గినా ప్రభుత్వం కార్మికులకు మరో అవకాశం ఇస్తుందా...? అంటే అనుమానమే అని చెప్పాలి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఎక్కువగా నష్టపోయింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మాత్రమే. 47 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: