మహారాష్ట్రలో ఎవరి నేపథ్యం లో ప్రభుత్వం ఏర్పడుతుందో అన్న  సందిగ్థత  కొనసాగుతుంది  ప్రభుత్వం  గురువారం రోజున కాంగ్రెస్ ఎన్సీపీలు మరోసారి భేటీకానున్నాయి. సిద్ధాంతపరంగా విబేధాలు ఉన్న శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్రపతి పాలన ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కసరత్తులు చేస్తున్నాయి.


 ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకూడదని ఆలోచిస్తున్నాయి . ఇందులో భాగంగానే గురువారం    కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య చివరిసారిగా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం తర్వాత ఓ కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం కూడా కొన్ని గంటల పాటు ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ సీనియర్ నేతల మధ్య చర్చలు జరిగాయి. 


పదవుల పంపకాలు, కామన్ మినిమమ్ ప్రోగ్రాం‌లపైనే చర్చ జరిగింది.ఇక గురువారం కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు ఒక ప్రకటన చేసే అవకాశముంది. ఇరుపార్టీ నేతల సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లు కలిసి మరోసారి సమావేశం అవుతారు. 


 ఇదిలా ఉంటే ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కలిసి శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంటుందని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో రాజకీయ అనిశ్చితికి త్వరలోనే తెరపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు మూడు పార్టీలు కలిస్తేనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎన్సీపీ ముఖ్యనేత నవాబ్ మాలిక్ చెప్పారు.ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అభ్యర్థే ఉంటారని మరోసారి స్పష్టం చేశారు ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్. అయితే ఐదేళ్ల పాటు ఉంటుందా లేదా అనేదానిపై సంజయ్ రౌత్ క్లారిటీ ఇవ్వలేదు. . 


ఇప్పటికే అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని మరో ఐదురోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. మూడు పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే అదికాస్త సమయం తీసుకుంటుందని చెప్పారు సంజయ్ రౌత్.ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి పదవి రొటేషనల్ పద్ధతిలో ఉండాలని ఎన్సీపీ పట్టుబడుతోంది. 

 

తొలి రెండున్నరేళ్లు శివసేనకు ఇచ్చి ఆ తర్వాత రెండున్నరేళ్లు ఎన్సీపీకి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇక కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కోరుతోంది. అంతేకాదు శివసేనకు తమకు సీట్ల సంఖ్యలో పెద్దగా తేడా లేదని కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు తమకంటే ఎక్కువగా వచ్చినట్లు చెబుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: