ప్రస్తుతం  మానవునిలో మానవత్వం మాయమైపోతుంది. రోజు రోజుకు మానవుడు మృగంలా మారిపోతున్నాడు. డబ్బు మీద వ్యామోహంతో సొంత వాళ్ళని కూడా చూడకుండా కర్కశత్వానికి  సిద్ధంమవుతున్నారు. ఆస్తి మీద మోజుతో అయినవాళ్లనే  అంతమొందిస్తున్నా.. కొంత మంది దుర్మార్గులు. అలాంటి సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

 

తాజాగా ఆస్తి తగాదాలతో అన్న పై తమ్ముడు హత్యాయత్నం చేసిన సంఘటన విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ తాతయ్య తెలిపిన  కథనం ప్రకారం.. అడ్డురోడ్డుకి చెందిన వర్ధన పూడి లక్ష్మీకాంతం హెల్త్ సూపర్వైజర్ గా పనిచేసి పదవి విరమణ పొందడం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు ప్రకాష్ రెడ్డి కుటుంబానికి చాల కలం నుంచి దూరంగా ఉంటున్నాడు. కొద్దికాలంగా ఆస్తి పంచాలని ప్రకాష్ రెడ్డి గొడవ చేయగా.. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. 

 

లక్ష్మీకాంతంతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు ఆస్తి పంచేందుకు 4 వాటాలు వేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఆస్తులు ఎక్కువ భాగం తనకే ఇవ్వాలని ప్రకాష్ రెడ్డి తరచూ గొడవలు పడేవాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో అన్న వసంత్ రెడ్డి పై కక్ష బాగా పెంచు కుంటూ వచ్చాడు. ఇక తాజాగా  వసంత్ రెడ్డి తలపై ఇనుప రాడ్ తో ప్రకాష్ రెడ్డి కొట్టడం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇతనిని స్థానికులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో.. అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి  తరలించడం జరిగింది. ఈ ఘటనపై తల్లి లక్ష్మీకాంతం ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్ సి తెలియచేయడం జరిగింది. పూర్తి వివరాలు హెచ్ సి  కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: