బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన  కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఎంపీలు బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో కులరాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్..చంద్రబాబుకు మతపర మైన విధానంలో తేడా లేదన్నారు. క్రిస్టియన్..ముస్లింల ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవం..ముస్లిం మాత్రమే మతాలని..హిందూ మతం మతం కాదు..ధర్మం..జీవన విధానం అని చెప్పుకొచ్చారు. 

 

        బీజేపీ మతరపరమైన ఓట్ బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకం అన్నారు. పాస్టర్లకు..ఇమాంకు జీతాలు ఇస్తామని చంద్రబాబు..జగన్ ఇద్దరూ అన్నారని గుర్తు చేసారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చటానికి ఇంగ్లీషు టీచర్లు ఉన్నారా అని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..జగన్ ఇంకా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారని వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారు.. వైసీపీ ఎంపీలు బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు.

         

         ఎంత మంది బీజేపీలోకి వస్తారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. గతంలో విశాఖలో ఆయన గంటా తో సమావేశం తరువాత టీడీపీలో ఎవరూ మిగలరని..మొత్తం ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారంటూ వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెర లేపారు. ఇక, ఇప్పుడు వైసీపీ ఎంపీలు తమ పార్టీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని చెప్పటం ద్వారా వైసీపీ శిబిరంలో కలకలం రేపే ప్రయత్నం చేసారు. 


        ఇప్పటికే..మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం ఢిల్లీలో వైసీపికి చెందిన 10-12 మంది ఎంపీలు సర్దుకుంటున్నారని ముందు వారిని సరి చేసుకోవాలని సూచించారు. ఉమా వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోకపోయినా..కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీల తీరు.. ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఇది కొత్త చర్చకు కారణమైంది.

 

       జగన్ కు ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టారని..ఇంకా ఎమ్మెల్యేల అవసరం ముఖ్యమంత్రికి ఏంటని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. అవినీతి అక్రమాల కేసులు వున్నవారిని మేం తీసుకొకూడదంటే ఎలా అని వ్యాఖ్యానించారు. . మేం కూడా పరిపాలించాలనుకుంటున్నాం..అంటూ చెప్పుకొచ్చారు. మమ్మల్లి మాత్రమే కరెక్ట్ గా వుండాంటే ఎలా అని వీర్రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

 

       తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదని...ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారుక్రిష్టియానిటీని ప్రొత్సహించేందుకే ఇంగ్లీషు మీడియం తీసుకవస్తున్నారంటూ.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖలకు ఆయన్నే వివరణ అడగాలన్నారు. టీటీడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని... మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని వీర్రాజు సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: