చికెన్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి.  ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు.  కొంతమంది చికెన్ లేకుండా ముద్ద ముట్టరు.  చికెన్ కోసం ఎంత దూరమైనా వెళ్తుంటారు.  మందుబాబులకైతే చికెన్ లేకుంటే ఒక్క గుటక కూడా వేయలేరు.  అంతెందుకు.. చికెన్ తిని మెదడును షార్ప్ చేసుకొని దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకుంది తమన్నా.  ఇది సినిమానే కావొచ్చు.  బ్రెయిన్ పెరగడానికి చికెన్ కూడా కొంతమేరకు సహకరిస్తుంది.  అందుకే చికెన్  చాలా మంది చెప్తుంటారు.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ చికెన్ అందరిని భపెడుతున్నది.  భయపెడుతున్నది అంటే.. అప్పట్లో చెప్పినట్టుగా చికెన్ తింటే జబ్బులు వస్తాయి అని కాదు.. చికెన్ తీసుకోవడం వలన జబ్బులు రావడం కాదు.. డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మాములుగా చికెన్ ధర మార్కెట్లో కొన్ని రోజుల క్రితం వరకు కేజీ ధర రూ. 180 ఉండేది.  దసరా తరువాత ఈ ధరలు కొండెక్కాయి.  కేజీ చికెన్ ధర రూ. 240 వరకు పలుకుతుంది.  లైవ్ లో కేజీ కోడి ధర కూడా పెరిగిపోయింది.  


అంటే లైవ్ లో కేజీ ధర 105 వరకు ఉంటె దానిని కోసి, వెస్ట్ అంతా తీసేయగా మిగిలే చికెన్ 500 నుంచి 600 గ్రాములు ఉంటుంది.  కేజీ తీసుకోవాలి అనుకుంటే దానికి డబుల్ ధరకు పైగా పెట్టాలి.  ఇలా ధరలు అమాంతంగా పెరగడానికి కారణాలు ఉన్నాయి.  రాష్ట్రంలో ప్రతి ఏడాది 2 కోట్ల కోళ్లను పెంచుతుంటారు. ఈ పెరుగుదల ప్రతి ఏడాది నాలుగు నుంచి ఐదు శాతం ఉంటుంది.  కానీ, ఈ ఏడాది ఈ పెరుగుదల కనిపించడం లేదు.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  కోడి దాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది.  


ఒక కోడి రెండు కేజీల బరువు పెరగాలి అంటే దానికి నాలుగు కేజీల దాణా అవసరం అవుతుంది.  కోడి రెండు కేజీల బరువు పెరగడానికి కనీసం రూ. 144 ఖర్చు అవుతుంది.  రెండు కేజీలున్న కోడి మార్కెట్లో 210 వరకు పలుకుతుంది.  ఇది బయట మార్కెట్లో.  రైతు దగ్గరకు వచ్చే సరికి ఆ రేటు ఉండదు కదా.  రైతులు కోడిని పెంచడానికి అయ్యే ఖర్చులు కలుపుకొని మిగిలేది చాలా తక్కువ.  దాణా ధరలు పెరిగిపోయాయి.  గతేడాది మొక్కజొన్న, సోయాబీన్, తవుడు, నూకల ధరలు ఒకలా ఉంటె, ఈ ఏడాది ఈ ధరలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో తినకుండానే కోడి భయపెడుతున్నది.  చికెన్ కు ప్రత్యామ్నాయంగా ఉండే వాటికోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: