ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నుండి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారు. సమయం, సందర్భం వచ్చినపుడు మాత్రమే వైసీపీ, టీడీపీ పార్టీల నుండి బీజేపీ పార్టీలో చేర్చుకుంటామని ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోబోమని సుజనా చౌదరి చెప్పారు. 
 
వైసీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరబోయే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరనే ప్రశ్నకు మాత్రం సుజనాచౌదరి సమాధానం దాటవేశారు. గత కొన్ని రోజుల నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమేనా...? అనే ప్రశ్నకు బీజేపీ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని అన్నారు. బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని సుజనా చౌదరి అన్నారు. 
 
పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలలో ఎవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలియదని తనతో మాత్రం పవన్ కళ్యాణ్ టచ్ లో లేరని సుజనా చౌదరి చెప్పారు. బీజేపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తోందని సుజనా చౌదరి తెలిపారు. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో మరియు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 
 
సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజమైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కష్టమేనని చెప్పవచ్చు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పటంతో ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరా...? అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. మరి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: