ఇప్పుడు అంతా స్పీడ్ యుగం.. ఉరుకులు పరుగులు. అంతా గడియారం ముళ్ల మీద పరుగు పందెమే..పిల్లలూ అంతే పెద్దలూ అంతే.. ఉద్యోగం, ఆఫీసు, బిజినెస్, క్లయింట్స్.. ఈ హాడావిడిలో పడి చాలామంది ఉదయం పూట టిఫిన్ ఎగ్గొడుతుంటారు. అర్జంట్ షెడ్యూల్స్. దూర ప్రాంత ప్రయాణం.. వంటి కారణాలతో టిఫిన్ మానేస్తున్నారు.

 

అయితే ఇలా టిఫిన్ ఉదయం పూట మానేస్తే చాలా అనర్థాలు ఉన్నాయట. ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకలు అంటున్నారు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

 

రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించిన సైంటిస్టులు.. ఈ విషయం చెబుతున్నారు. వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ఈ కంక్లూజన్ కు వచ్చారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా.. నైట్ భోజనం తొందరగా తినేలా అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం మంచిదని వారి సలహా.

 

చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా ఏదో ఒకటి ఉదయాన్నే తినేయడం మంచిది. స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తున్నా.. ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి. ముందు ప్రాణం అంటూ ఉంటే కదా.. ఏదో ఒకటి చేసేది.. ఏమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: