గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు పథకాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టాడు. ఆ ఏడాదిలో రెండు దఫాలుగా రూ.8వేలు ఎకరానికి పెట్టుబడి సాయం అందించారు. ప్రస్తుతం ఎకరానికి 10 వేలు ఇస్తున్నారన్న విషయం మనకి తెలుసు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంగా కెసిఆర్ రైతు బంధు పథకం పై కొన్ని నిబంధనలను అమలు పరిచే ఆలోచనలో ఉన్నారని వ్యవసాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 

ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉన్న పంట పెట్టుబడికోసం రైతు బంధు సాయం ప్రభుత్వం అందించింది... కానీ రాబోయే రోజుల్లో పది ఎకరాలు దాటితే నో సాయం అని కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే రబీ సీజన్ నుంచి అమలు చేయునట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం కారణంగా ఒకవేళ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసి రైతుబంధు సాయంగా అందించినట్లయితే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని కేసీఆర్ భావిస్తున్నాడు.

 

ఎక్కువ ఎకరాలు ఉన్న ధనవంతులకు... ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు లాభపడుతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని సమాచారం. ఒకవేళ 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధు సాయం చేసినట్లయితే.. యేటా 2,500 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే 40 లక్షల మంది రైతులకు ఖరీఫ్ సీజన్లో రూ.4,400 కోట్లు రైతుబంధు సాయంగా ప్రభుత్వం అందించింది. కానీ ఇదే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఇతర 14 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదని సమాచారం.

 

 

దీంతో ప్రతిపక్ష వర్గాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మూడు దశలవారీగా రైతులకు డబ్బులు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: