ఇటీవల కాలంలో దొంగతనాలు జరగడం పెరిగిపోయింది.  ఎక్కడ చూసినా దొంగలు పెరిగిపోతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.  కనీసం ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నాగాని భయపడుతున్నారు.  ఎక్కడ ఎటునుంచి దొంగలు వచ్చి దోచుకుపోతారో అని భయపడుతున్నారు.  ఊరికి దూరముగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలని అనుకునే వాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు దొంగలు.  


మాములు దొంగలతో పాటు ఇటీవల కాలంలో చడ్డీ గ్యాంగ్ దొంగలు హడావుడి ఎక్కువైంది.  ఈ దొంగలు వేటిని లెక్కచేయరు.  దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని దొంగతనం చేస్తుంటారు. అడ్డుకోవాలని చూస్తే నిర్ధాక్షిణ్యంగా హత్య చేయడానికి కూడా వెనకాడరు.  అందుకే ఈ దొంగలంటే అందరికి హడల్.  ఎప్పుడు ఎక్కడ ఎలా దొంగతనానికి పాల్పడతారో తెలియడం లేదు.  


నగర శివార్లలో ఉండే హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో వీరు దొంగానాలను పాల్పడుతుంటారు.  దొరికినంత దోచుకుపోతుంటారు.  ఇటీవల హైదరాబాద్ శివారులో ఉన్న హయత్ నగర్ లో ఉన్న కుంట్లూరులో అర్ధరాత్రి చడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది.  కొన్ని ఇండ్లలో దొంగతనానికి పాల్పడింది.  దొంగతనం చేస్తూ.. సీసీటీవీలకు చిక్కారు.  సిసి టివి లకు చిక్కినా సరే ఎలాంటి భయం బెరుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు.

 
దొరికితే.. ఏదోలా తప్పించుకొని బయటకు రావడం బయటకు వచ్చిన తరువాత తిరిగి మరలా దొంగానాలకు పాల్పడటం షరా మామూలే అయ్యింది.  దొంగతనాలు చేయడానికి ఆలోచించడం లేదు.  దొంగగా అలా మారుతున్నారు..  ఎందుకు మారుతున్నారు.  ఎక్కడి నుంచి వస్తున్నారు, వారి మూలాలు ఏంటి అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.  ముందు వాటిపై దృష్టిపెట్టి దానిని అరికడితే.. అన్ని సర్దుకుంటాయి. నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.  చేతికి దొరికినట్టుగా దొరికి తప్పించుకుపోవడం వీరి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. వీరిని ఇలానే వదిలేస్తే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: