రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వాళ్ళ పార్టీపై అభిమానం తో చేసే పనులు వాళ్ళ   అధికార పార్టీ నాయకుల మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది..ప్రభుత్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేయడానికి రాజకీయ ప్రత్యర్థులకు  అస్త్రంలాగా మారుతోంది.ఇదే క్రమం లో  జెండా రంగుల వివాదం రోజురోజుకూ ఉధృతమౌతోంది ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు వైఎస్ఆర్సీపీ జెండాలోని రంగులతో నింపేయడాన్ని తప్పు పడుతూ ఇదివరకే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతాపార్టీలు అధికార పార్టీలు కలిసి వైసీపీ పై విమర్శలు చేసారు .

 

 తాజాగా మరోసారి అలాంటి ఉదంతానికి అవకాశం ఇచ్చినట్టయింది వైఎస్ఆర్సీపీకి.జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని అమర్చిన దిమ్మెకు వైఎస్ఆర్సీపీ జెండా రంగులు పూలిమి ఉన్న ఓ ఫొటోను పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. `వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈరోజు గాంధీజీ, రేపు ఎవ్వరు శ్రీ జగన్ రెడ్డి జీ..? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయనగరం జిల్లాలోనిది ఈ ఫొటో అని రాశారు.

 

ఈ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దీనిపై ఘాటు కామెంట్లను చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రంగులు వేసుకుని పరిపాలన సాగిస్తోందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మహాత్మగాంధీని మాత్రమే వదిలి వేసి, దిమ్మె మొత్తాన్నీ రంగులతో నింపేశారని విమర్శిస్తున్నారు.

 

ఇదివరకు అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఓ గ్రామ పంచాయతీ భవనంపై ముద్రించి ఉన్న జాతీయ పతాకాన్ని చెరిపేసి, వైసీపీ రంగులను పూసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జెండా రంగుల వ్యవహారం పార్టీ నాయకులకు తలనొప్పిని తెచ్చి పెడుతూనే వస్తోంది. అధికార పార్టీ నాయకులను విమర్శల సుడిగుండంలో నెట్టేస్తోంది. ఆత్మరక్షణలో పడేస్తోంది. విమర్శలకు సమాధానాలను ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: