బీజేపీ ఎంపి సుజ‌నాచౌద‌రి చేస్తున్న కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.. సుజ‌నాచౌద‌రి చేస్తున్న ఈ కామెంట్లు బీజేపీ వేస్తున్న ఎత్తుగ‌డ రాజ‌కీయాలా.. లేక చంద్ర‌బాబు ప‌న్నుతున్న కుయుక్తులా..?  టీడీపీలో గెలిచి బీజేపీలో చేరి పీఎం న‌రేంద్ర‌మోదీ భ‌జ‌న‌కు బ‌దులుగా బాబు భ‌జ‌న చేస్తున్న సుజ‌నాచౌద‌రి ఇప్పుడు ఓ కొత్త ఎత్తుకు నాంది ప‌లికారు. అయితే ఇప్పుడు సుజ‌నాచౌద‌రి చేస్తున్న ఈ కామెంట్లు బీజేపీ మైండ్‌గేమ్ లో భాగ‌మా లేక ? చంద్ర‌బాబు నాయుడు త‌న అనుచరుల‌తో ఆడిస్తున్న నాట‌కాల్లో ఓ భాగ‌మేనా...? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.



అయితే ఏపీలో బీజేపీ బ‌లోపేతం చేయాల‌ని భాజపా నేత‌లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ది నిజం. టీడీపీ కి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను బీజేపీలో చేర్చుకుంది. అయితే బీజేపీలో చేరిన సుజ‌నాచౌద‌రి మాత్రం టీడీపీ స‌భ్యుడిగానే వ్య‌వ‌హ‌ర‌శైలీ ఉంది. బీజేపీ ముసుగులో త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే టీడీపీని వీడిన‌ట్లుగా అనేక‌సార్లు ఆయ‌న వేషం బ‌య‌ట‌ప‌డింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజ‌నా చౌద‌రిని టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బినామిగా, ఆయ‌న నీడ‌గా ఇప్ప‌టికి వైసీపీ నేత‌లు అనేక‌సార్లు అభివ‌ర్ణించారు.



ఇప్పుడు సుజ‌నా చౌద‌రి బీజేపీలో చేరిన‌ప్ప‌టికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌నిచేస్తున్నారు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. సుజ‌నాచౌద‌రి వైసీపీ ప్ర‌భుత్వంపైనా వ్య‌తిరేక‌త‌ను, చంద్ర‌బాబుపైనా ప్రేమ‌ను ఒల‌కబోస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుజ‌నాచౌద‌రి చేసిన వ్యాఖ్యాలు ఏపీలో రాజ‌కీయ చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. వైసీపీకి చెందిన దాదాపు 20మంది ఎంపీలు బీజేపీకి ట‌చ్‌లో ఉన్నారు అని సుజ‌నాచౌద‌రి వ్యాఖ్యానించారు.



సుజ‌నా చౌద‌రి కామెంట్లు వింటుంటే ఇది బీజేపీ మైండ్‌గేమా.. చంద్ర‌బాబు ఆడిస్తున్న నాట‌క‌మా అనేది  తేలాల్సి ఉంది. సుజ‌నా చౌద‌రి కావాల‌నే వైసీపీని ఇలా రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకు, వైసీపీ ఎంపీల న‌డుమ వైరుధ్యం సృష్టించేందుకు ఆడిన డ్రామాగా కనిపిస్తుంది. వైసీపీ ఏపీలో 22ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. ఓ పార్టీ గెలుచుకున్న స్థానాల్లో అత్య‌ధిక భాగంగా అంటే 20మంది ఎంపీలు పార్టీ మారాల‌నుకుంటున్నారు అనేది అది న‌మ్మ‌ద‌గిన స్టేట్ మెంట్ కాదు. పార్టీ మారాల‌నుకుంటే ఒక్క‌రో ఇద్ద‌రో మారుతారు.. లేకుంటే ఏ ఐదుగురో.. ఆరుగురో మారుతారు.. కానీ ఇలా గంప‌గుత్త‌గా ఎంపీలంతా పార్టీ మారాల‌నుకుంటున్నారు అనేది ఇది కేవ‌లం రాజ‌కీయ డ్రామాగానే అభివ‌ర్ణిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.



అంతే కాదు చాలా మంది  వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. అధికార పార్టీని వ‌ద‌లి ఎమ్మెల్యేలు అధికారం లేని పార్టీలోకి వెళుతారా అనేది ప్ర‌శ్న‌. అంటే బీజేపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి వైసీపీని ఇరుకున పెట్టెందుకు, టీడీపీని కాపాడేందుకు ఆడుతున్న ఓ కుటిల రాజ‌కీయ డ్రామాగానే భావిస్తున్నారు. అంతే కాదు చంద్రాలు సుజ‌నాచౌద‌రి చేత ప‌లికిస్తున్న వాక్కులుగానే అనుకుంటున్నారు. టీడీపీని ఏపీలో కాపాడేందుకు సుజ‌నాచౌద‌రి వేసిన ఎత్తుగ‌డ‌గా అనిపిస్తుంది. సుజ‌నాచౌద‌రి గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కారుపై విమర్శ‌లు చేయ‌డం, అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని బాబుకు అనుకూలంగా మాట్లాడ‌టం, ఇసుక రాజ‌కీయం చేయ‌డం, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని అన‌డం చూస్తుంటే వైసీపీని వ్యూహ‌త్మ‌కంగా ఇరుకున పెట్టే క‌వ్వింపు చ‌ర్య‌ల్లో భాగ‌మే అంటున్నారు  రాజ‌కీయ నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: