ఇది ఇపుడు జరిగిన సంఘటన కాదు 1948 సెప్టెంబర్‌ 17వ తేదీకి హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు అప్పటి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి లండన్‌ లోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అకౌంట్‌కు చేరిన నిజాం నిధులు మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నాయి అన్ని తెలుస్తుంది. సుమారు 70 ఏళ్లగా సాగుతున్న ఈ నిధుల వివాదంపై అక్టోబర్‌ 3న లండన్‌ రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌. 1948లో బదిలీ అయిన రూ.3.5 కోట్ల నిధులు తిరిగి నిజాం వారసులు, భారత దేశానికే చెందుతాయని తీర్పునిచ్చింది. 

 

అయితే తమకు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్‌కు ఏమైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లో అప్పీల్‌ చేయాలి అని గడువు విధించింది లండన్‌ రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌. అయితే నవంబర్‌ 4వ తేదీ వరకు పాకిస్తాన్‌ అప్పీల్‌ ముందుకు రాకపోవటంతో నిధుల బదిలీ ఇక లాంచనమేనని నిజాం వారసులు భావిస్తున్నారు. 

 

 విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్‌ నవాజ్‌ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ అకౌంట్‌ నుంచి రూ.3.5 కోట్లు లండన్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ రహమతుల్లా అకౌంట్‌లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్‌ విలీనం కావటం ఉస్మాన్‌ అలీఖాన్‌ రాజ్‌ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. 

 

ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు  ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత దేశ ప్రభుత్వం లండన్‌ కోర్టులో ఇంప్లీడ్‌ అయింది. దీంతో పాకిస్తాన్‌ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్‌ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పం పారు.’ అని వాదనలను వినిపించినా. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ నిధులను భారత్‌కు 51 శాతం, వారసులకు 49 శాతం మేర పంచుతారా..? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: