తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చదువుల విషయంలో కీలక శ్రద్ధ వహిస్తున్న కేసీఆర్ సర్కార్… రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే జీవో రావడంతో…  తెలంగాణ విద్యాశాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను స్పీడప్ చేశారు. త్వరలోనే అధికారులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి.. అక్కడ ఎలా అమలు చేయబోతున్నారనే విషయాన్ని అధ్యయనం చేయనున్నారు. 

 

నార్త్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రైమరీ స్థాయి వరకు మాతృభాషలోనే బోధన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలు చేయాలా వద్దా ? అన్నదానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వైపే మొగ్గుచూపుతుండటంతో.. వారి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని సబ్జెక్ట్ లను ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ.. తెలుగును ఒక సబ్జెక్ట్ గా ఉంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA - HYDERABAD' target='_blank' title='telangana-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a> schools

ప్రభుత్వ విద్యా సంస్థలైన మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటంతో తమ పిల్లలను అక్కడికే పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అయితే అందరికీ సీట్లు దొరకడం కష్టంగా మారుతుండటంతో వారు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారికి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టడం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేస్తే... పేద పిల్లలకు కూడా స్కిల్స్ పెరిగి భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో సీఎం కేసీఆర్ గట్టి నిర్ణయంతో ఉండటంతో త్వరలోనే అన్ని విషయాలు సర్దుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

 

ఇంగ్లీష్ మీడియం ప్రక్రియను మొత్తం నెలరోజుల్లో పూర్తి చేసి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో స్కూళ్లను మూసివేసే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తే .. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు.. పేద పిల్లలకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: