ఏపీ సీఎం జగన్‌ పై చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారా? అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నిరాశలో ఉన్న టీడీపీ అధినేతకు ఎన్నికల తర్వాత తొలి విజయం దక్కిందా? అంటే అవుననంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ తొలి విజయం దక్కింది ఏపీ రాజధాని అమరావతి విషయంలోనే అని చెబుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శంకుస్థాపనకు ప్రధాని మోదీ కూడా విచ్చేశారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం సరిపోలేదు. ఆలోగా ఎన్నికలు వచ్చి చంద్రబాబు ఘోర పరాజయం చెందారు.  

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAGAN' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> and chandrababu naidu

వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయఢంకా మోగించారు. ఆయన అధికారం చేపట్టాక కొన్ని రోజులకు వైసీపీ నేతలు రాజధాని మార్పు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అమరావతి రాజధానికి సరిపోదని, అననుకూల పరిస్థితుల దృష్ట్యా దాన్ని మార్చాల్సి వస్తుందని కొందరు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. దాంతో ఒక్కసారిగా రాజధానిపై చర్చ మొదలైంది. అమరావతిని పక్కనబెట్టి కొత్త రాజధానిని సీఎం జగన్ నిర్ణయిస్తారని, అక్కడే నిర్మాణం జరుగుతుందని వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు, రాజధాని కోసం ఒక కమిటీని కూడా వేయడంతో ఆ వార్తలు నిజమేనా? అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంతలో.. భారతదేశ కొత్త మ్యాప్‌ను కేంద్రం విడుదల చేసింది. అందులో అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలతో పాటు, నేతలను, పారిశ్రామిక వేత్తలను విస్మయానికి గురి చేసింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAGAN' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> and chandrababu naidu

 

రాజధాని అమరావతి నుంచి నిజంగానే తరలిపోతోందని అందరూ అర్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు దీనిపై నిరసనలు కూడా చేపట్టారు. మరి రాజధాని సంగతి ఏంటని? కేంద్రాన్ని నిలదీసే వరకు స్పష్టత రాలేదు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌ సభలో దీనిపై ప్రస్తావిస్తూ ‘2019 అక్టోబరు 21న కేంద్ర హోంశాఖ ఇండియా న్యూ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఆ చిత్రపటాన్ని చూసి మేమంతా షాక్‌ కు గురయ్యాం. ఎందుకంటే ఆ మ్యాప్‌ లో ఏపీ రాజధాని అమరావతి లేదు. ఇది ఏపీ ప్రజలకే కాదు, ప్రధాని మోదీకి కూడా అవమానకరం. 2015లో ఆయనే రాజధానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశముంది. ఈ సమస్యను పరిష్కరించి మళ్లీ కొత్త మ్యాప్‌ను విడుదల చేయాలి’ అని అన్నారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAGAN' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> and chandrababu naidu

 

వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ తొందర్లోనే రాజధానిని చేరుస్తామని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆ మరుసటి రోజే సర్వే ఆఫ్ ఇండియా అమరావతిని రాజధానిగా చేరుస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఏపీ రాజధాని అమరావతే అని స్పష్టత వచ్చింది. అయితే, రాజధాని మారుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్రం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ విడుదల చేసిన మ్యాప్ చంద్రబాబుకు ఊరట కల్పించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా సీఎం జగన్‌పై చంద్రబాబుకు ఎన్నికల తర్వాత ఇది తొలి విజయం అని చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: