వైసీపీకి నారా లోకేషే ప్లస్ అయ్యాడా? లోకేష్ రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీకి తిరుగులేదా ? అంటే వైసీపీ కార్యకర్తలని అడిగితే అవుననే సమాధానం చెబుతున్నారు. లోకేష్ వల్ల టీడీపీకి ఎంత లాభం జరిగిందో తెలియదుగానీ తమకైతే బాగా లాభం జరిగిందని కార్యకర్తలు భావిస్తున్నారు. గత అయిదేళ్లుగా లోకేష్ చేస్తున్న రాజకీయాలు తమకు అడ్వాంటేజ్ గా మారాయని, అలాగే ఇప్పుడు కొంత తమ ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఉన్న లోకేష్ వల్ల టీడీపీ దాన్ని కూడా క్యాష్ చేసుకోలేని స్థితిలో ఉండిపోయిందని వారు చర్చించుకుంటున్నారు.

 

మామూలుగా చంద్రబాబు సింగిల్ గా రాజకీయాలు చేస్తే తమకు ఎంతోకొంత ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ బాబు.. కుమారుడు కోసం రాజకీయాలు చేస్తుండటం తమకు కలిసొచ్చిందని అంటున్నారు. కుమారుడు కోసం బాబు వరుసగా తప్పులు చేస్తూనే వస్తున్నారని, అవే తమకు శ్రీరామరక్షగా ఉంటున్నాయని లోలోపల ఆనందపడిపోతున్నారు. ఎన్నికల్లో గెలవకపోయిన లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఇక మంత్రిగా లోకేష్ మాట తీరు, తప్పులు తప్పులుగా మాట్లాడటం, సీనియర్లు ఉన్న పార్టీలో ఆధిపత్యం చెలాయించడం వల్ల టీడీపీ ప్రజల్లో నెగిటివ్ అయిపోయిందని, అదే తమకు కలిసొచ్చిందని అనుకుంటున్నారు.

 

అసలు టీడీపీ దారుణంగా ఓడిపోవడానికి లోకేష్ కూడా ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే లోకేష్ చివ‌ర‌కు ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక‌పోయాడు. లోకేష్ కోసం బాబు ఎన్టీఆర్‌ను దూరం పెట్ట‌డం కూడా నంద‌మూరి అభిమానుల‌కు ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు. అయితే వైసీపీ శ్రేణులు ప్రకారం చూసుకుంటే చాలావరకు నిజాలు కనిపిస్తున్నాయి.

 

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకిత వచ్చిన దాన్ని టీడీపీకి అనుకూలంగా మలుచుకోవడంలో కూడా ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. ఇక తాజాగా పార్టీని వీడే నేతలు కూడా లోకేష్ అసమర్ధతని ఎత్తి చూపే బయటకొస్తున్నారు. మొత్తానికి బాబు...కావాలని అసమర్ధత గలిగిన కొడుకుని అందలం ఎక్కించాలని చూడటం వల్లే తమకు ప్లస్ గా మారుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: