ప్రజలకు వ్యతిరేకంగా జనసేన పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు. అవును నిజమే ఇప్పటివరకు ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నానని చెబుతున్న పవన్..ఇప్పుడు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ప్రతి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే లక్ష్యంతో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, అలాగే తెలుగు సబ్జెక్ట్ ని తప్పనిసరి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

 

ఇక ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇక పవన్ కల్యాణ్ కూడా ఇంగ్లీష్ మీడియం వల్ల మాతృబాష తెలుగు కనుమరుగవుతుందని వ్యాఖ్యనిస్తున్నారు. పైగా దీని కోసం ఓ పోరాటం కూడా మొదలుపెట్టారు. మన నుడి-మన నది పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  మాతృభాషను, విషతుల్యమవుతున్న జలవనరులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఇందులో మాతృబాషని పరిరక్షించేందుకు తెలుగు పండితులు, మేధావులు సలహాలు ఇవ్వాలని, అందరూ దీనికి మద్ధతు తెలపాలని కోరుతున్నారు.

 

అయితే పవన్ నిర్ణయం ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది. ప్రజలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియమే కావాలని జగన్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. ఈ విషయం పలు మీడియా సంస్తలు నిర్వహించిన పోల్స్ లో కూడా స్పష్టమైంది. పైగా తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని ప్రతిపక్షాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో టీడీపీ లాంటి పార్టీ సైతం దీనిపై వెనక్కి తగ్గి, తాము ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పలేదని వివరణ ఇచ్చుకుంటుంది. కానీ పవన్ మాత్రం ఓ ఉద్యమమే మొదలుపెట్టారు. దీన్ని ప్రజలు ఏ మాత్రం హర్షించడం లేదు. అందుకే తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: