మహారాష్ట్ర రాజకీయాలు ఫైనల్స్ మ్యాచ్ ను తలపించేలా జరుగుతున్నాయి.  హార్ట్ ఎటాక్ ఉన్న వ్యక్తులు గుండెను పట్టుకొని కూర్చున్నారు.  టెన్షన్ తట్టుకోలేని వ్యక్తులు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతున్నారు.  మహారాష్ట్రలో కూర్చొని టీవీలు చూసే వాళ్లకు నరాలు తెగే ఉత్కంఠతను ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ క్షణం ఏం జరుగుతుందో, కాసేపటి తరువాత ఇంకేం జరగబోతుందో తెలియక తికమకపడుతున్నారు.  
162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఈవిషయాన్ని నిన్నటి రోజున నిరూపణ జరిగింది.  అయినా సరే, ఎన్సీపీ నేత అజిత పవార్ ను  వెనక్కి పిలుస్తున్నది.  ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెనక్కి రావాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.  అటు శరద్ పవార్ కూడా వెనక్కి రావాలని అంటున్నాడు.  ఎన్సీపీ నేత తిరిగి వచ్చి కలిస్తే.. తద్వారా వాళ్లకు బలం ఉందని ఖచ్చితంగా నిరూపణ జరుగుతుంది.  
కానీ, అజిత్ పవార్ రానంత వరకు వాళ్లకు భయమే.  ఎందుకంటే అజిత్ పేవర్ కు ఎన్సీపీలో బలం ఉన్నది.  అజిత్ అంత కాకపోయినా.. తన వర్గం నేతలు ఉన్నారు.  తనకు కావాల్సినంతమంది ఎమ్మెల్యేలు తనకు ఉన్నారు.  56 మందిలో అజిత్ వర్గం ఎమ్మెల్యేలు 30 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది.  వీరంతా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తారు.  అందులో సందేహం అవసరం లేదు. 
అజిత్ తిరిగి ఎన్సీపీలోకి రానంతవరకు శరద్ పేవర్ కే కాదు, అటు శివసేన, కాంగ్రెస్ పార్టీకి కూడా టెన్షనే.  మరోవైపు శివసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు.  ఇదంతా బలనిరూపణ తరువాత తప్పకుండా జరుగుతుంది.  అయితే, ముందు బలనిరూపణ జరగాలి.  బలనిరూపణ అన్నది రహస్య వోటింగ్ పద్దతి ద్వారా జరుగుతుంది కాబట్టి ధీమాగా ఉన్నారు.  మరి బలనిరూపణ ఎలా ఏంటి ఎప్పుడు అన్నది ఈరోజు తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: