రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ ఒక్కసమస్యను పరిష్కరించలే దని, పాలకులు ఆంగ్లమాధ్యమంపై పెట్టిన శ్రద్ధను, వారి సమస్యల పరిష్కారంపై, పాఠశాల ల్లో మౌలికవసతుల కల్పనపై చూపాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం  రాష్ట్ర అధ్యక్షులు చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌ సూచించారు.  ఇంగ్లీషు మాధ్యమాన్ని ఏకపక్షంగా వ్యవస్థపై రుద్దాలని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఉపాధ్యాయుల విషయంలో కొత్తసమస్యలను సృష్టిస్తోం దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమికపాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకు ంటున్న పాలకులు, గతంలో తెలుగుదేశం హాయాంలో మున్సిపల్‌పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఎందుకు వ్యతిరేకించారని చంద్రబోస్‌ ప్రశ్నించారు. 
ఆనాడు  తెలుగుదేశం ఇంగ్లీషు మీడియానికి సమాంతరంగా తెలుగుమీడియాన్ని కూడా కొనసాగిస్తే,  వైసీపీ ప్రభుత్వం 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా తెలుగుమీడియాన్ని ఎత్తేసేలా ఉత్తర్వులిచ్చిందన్నారు. 2, 3, 4వతరగతి పిల్లలు ఇప్పటివరకు తెలుగులో చదువుతూ, ఒకేసారి ఇంగ్లీషు మీడియం చదవాలంటే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయసంఘాలు, తల్లిదండ్రులతో సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయన్నారు. ఒకటిన్నర దశాబ్దం క్రితంనుంచే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల హైస్కూళ్లలో  ఇంగ్లీషు మీడియాన్ని బోధిస్తున్నారన్నారు. 
దశాబ్దంన్నర క్రితం నుంచే, ఆంగ్లమాధ్యమం అమలవుతు న్నా మెజారిటీవిద్యార్థులు తెలుగుమాధ్యమాన్నే ఎంచుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఆచరణలోసాధ్యంకాని విధంగా,  విద్యారంగాన్ని నాశనం చేసేలా  ఒకేమీడియం అమలుచేసి 28వేల ఉపాధ్యాయపోస్టులను ఎత్తేసేకుట్రకు ప్రభుత్వం తెరలేపిం దన్నారు. అమ్మఒడి పథకంపై రోజుకోరకంగా నియమనిబంధనలు మారుస్తున్న ప్రభుత్వం,   చివరికి 75శాతం హాజరుతప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చిందన్నారు. ఆ పథకం కింద విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలంటున్న ప్రభుత్వం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండా, ఉపాధ్యాయులను ఒత్తిడిచేయడం సరికాదన్నారు.  అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి 6 నెలలైనా ఇప్పటివరకు దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. 
సీపీఎస్‌పై ఎటూతేల్చకుండా  లక్షా 80వేలమంది ఉపాధ్యాయుల భవిష్యత్‌తో రాష్ట్రప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు దేశంలో ఇప్పటివరకు ఏరాష్ట్రంలో కూడా సీపీఎస్‌ విధానం రద్దుకాలేదని బోస్‌ చెప్పారు.  రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎమ్‌ఎస్‌) కింద ప్రతిజిల్లాలో హైస్కూల్‌కి ఇద్ద రు చొప్పునున్న 10వేలమంది ఉపాధ్యాయులకు 3నెలలుగా జీతాలు లేవన్నారు. జీతాలు అడిగితే రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి గ్రాంట్‌ రాలేదంటూ కుంటిసాకులు చెబుతోందన్నా రు. 2019 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీని కూడా జగన్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 
పేరివిజన్‌ కమిషన్‌ రిపోర్టు మొత్తం తయారైనాకూడా ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకోకుండా కేవలం ఐఆర్‌తో సరిపెట్టిందన్నారు. గతప్రభుత్వం రెండు డీఏలు బకాయిలుంటే, ఆనాడు విమర్శలు చేసిన జగన్‌, తాను అధికారంలోకి వచ్చాక 3డీఏలు పెండింగ్‌లో పెట్టాడన్నారు. డీఎస్సీ-2018పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్న రాష్ట్రప్రభుత్వం, 18వేల మంది ఉపాధ్యాయుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందన్నారు. రాష్ట్రంలో 657 మండలాలుంటే, 400 మండలాల్లో ఎంఈవోలు లేరన్నారు. మొత్తం 68మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లుంటే, కేవలం ఇద్దరు మాత్రమే ప్రభుత్వం నియమించిన వారున్నారని, మిగిలినవారంతా డిప్యుటేషన్‌పై పనిచేసేవారేనని బోస్‌ పేర్కొన్నారు. పాఠశాలలపై సక్రమమైన పర్యవేక్షణ లేకుంటే, ఫలితాలు అధ్వానంగా ఉంటాయన్నారు.  రాష్ట్రంలో ఒకేఒక్క ప్రభుత్వ వ్యాయామకళాశాల ఉందని, దానిలో ఒకేఒక్క లెక్చరర్‌ ఉన్నాడని, దశాబ్దంనుంచీ అలానే నడుస్తోందన్నారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌స్కీమ్‌ సౌకర్యాన్ని   అన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ వైద్యశాలల్లో అమలయ్యేలా చూడాలని, ఈహెచ్‌ఎస్‌ను అమలు చేస్తారో, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని కొనసాగిస్తారో ప్రభుత్వమే తేల్చాలన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: