వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చంద్రబాబు బాకా పత్రికలుగా పేరు పడిన పత్రికల తీరును ఏకిపారేశారు. వక్రభాష్యం, వక్ర బుద్ధితో కొన్ని పత్రికలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స చంద్రబాబును భుజాన మోసే పత్రికలు ఏం రాసుకున్నా అభ్యంతరం లేదని, ఎన్నికలకు ముందు ఇంతకు వంద రెట్లు వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లేలా రాశారని బొత్స అన్నారు.

 

 

జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 80 శాతం హామీలను అమలు చేశారని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజల తాలూకా అభివృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాన్ని చంద్రబాబు శ్మశానం కంటే హీనంగా తయారు చేశాడని మంత్రి బొత్స సత్య నారాయణ మరోసారి అన్నారు. రాష్ట్ర విభజనలో జరిగిన నష్టానికంటే.. గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టం వంద రెట్లు ఎక్కువ అంటూ మంత్రి బొత్స సత్య నారాయణ విమర్శించారు.

 

 

చంద్రబాబు రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ప్రజలిచ్చిన ఐదేళ్ల అద్బుతమైన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడని మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతే ధ్యేయంగా 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కునెట్టాడని, అన్నీ అంకెలతో సహా, లెక్కలతో సహా చెబుతామన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని ఫైరయ్యారు. రూ. 55 వేల కోట్ల అప్పును రూ.2.4 లక్షల కోట్లకు తీసుకెళ్లాడని, అది కాకుండా రూ. 40 వేల కోట్లు పెండింగ్‌ బిల్లులు పెట్టి వెళ్లిపోయాడన్నారు. అప్పులు చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు మంత్రి బొత్స సత్య నారాయణ .

మరింత సమాచారం తెలుసుకోండి: