ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టిసి ఉండేది.  2014 వ సంవత్సరంలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఆర్టీసీని కూడా విడదీశారు.  తెలంగాణకు సపరేట్ గా ఆర్టీసీని నియమించారు.  అయితే, మొదటి ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగింది.  అప్పట్లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది కాబట్టి వీటి గురించి పట్టించుకోలేదు.  ఆ తరువాత 2019 లో అక్కడ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  


అలా అక్కడ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయింది.  ఎన్నికల సమయంలో అక్కడి ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారు.  దానికి సంబంధించిన కమిటీ ప్రస్తుతం నడుస్తున్నది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మొత్తం మారిపోయింది.  అక్కడ చేసినపుడు ఇక్కడ మమ్మల్ని ఎందుకు చేయరు అని ప్రశ్నించడం మొదలైంది.  


అది కెసిఆర్ కు నచ్చలేదు.  ససేమిరా అన్నారు.. సమ్మెకు దిగారు.  52 రోజులపాటు సమ్మె జరిగింది.  అయినా సరే ప్రభుత్వం దిగిరాలేదు.  ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తున్నారు.  వాళ్ళు రోడ్డుపై కాకుండా మనుషులపై బస్సులు నడుపుతున్నారు.  దానిని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉన్నది చెప్పండి.  ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తామంటే ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకుంటోంది.  విధుల్లోకి వచ్చేందుకు వీలు లేదని అంటోంది.  


ఆర్టీసీని మూసేసి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.  దీని స్థానంలో ఓ కొత్త సంస్థను తీసుకొచ్చే పని చేస్తున్నది.  ఆర్టీసీని మూసేయడం అంటే నిజాం నవాబులు అవమానించడమే కదా.  నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజా రోడ్డు రవాణ సంస్థ ఏర్పడింది.  ఇప్పుడు దానిని కాదంటే వాళ్ళను అవమానపరిచినట్టే అవుతుంది.  నిజాం నవాబులు పొగుడుతూ వచ్చే కెసిఆర్ ఇప్పుడు ఆ పని చేస్తారా చూడాలి. ఒకవేళ కెసిఆర్ అదే చేస్తే దానికి ఎంఐఎం ఎలాంటి జవాబు చెప్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: