మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ నెల 9వ తేదీ నుండి నిర్వహించడానికి సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు పదిరోజులపాటు జరగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో ఎజెండా మొదలైన అంశాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాజధాని, ఇసుక మొదలైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏపీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ కీలక నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. 
 
నారా లోకేశ్ కు లేఖల రూపంలో స్పీకర్ గౌరవాన్ని తగ్గించే విధంగా 
పేర్కొన్నారన్న ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో ముగ్గురు టీడీపీ నేతలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం గురించి, లేఖల రూపంలో నారా లోకేశ్ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శ్మశానంతో రాజధానిని పోల్చడం దారుణమని యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలు రాజధాని కోసం భూములను ఇస్తే రైతుల త్యాగాలను మంత్రి బొత్స సత్యనారాయణ అవహేళన చేయడం సరికాదని యనమల అన్నారు.  తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పథకాల అమలు, ఇంగ్లీష్ మీడియం, మద్య నిషేధం, పోలవరం, రాజధాని, ఇసుక మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: