మహారాష్ట్ర లో ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించిన బీజేపీ నాయకత్వం , గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ని అన్ని విధాలుగా వాడుకుందన్నది నిర్వివాదాంశమే . ఇక ఇప్పుడు మహారాష్ట్ర లో అధికారం దక్కదని తేలిపోవడం తో నష్ట నివారణ చర్యల్లో భాగంగా కోష్యారి పై వేటు వేయాలని కేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది . కోష్యారి ని తప్పించి మహారాష్ట్ర గవర్నర్ గా రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకారం చేయనున్న ఉద్దవ్ ఠాక్రే , కోష్యారి ని కలిసిన కొద్దిసేపటి తరువాతే , ఈ ప్రచారం జరుగుతుండడం హాట్ టాఫిక్ గా మారింది . మహారాష్ట్ర లో బీజేపీ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేయడం తో , శివసేన , ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చాయి . అయితే వారు అడిగినంత సమయం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు కోష్యారి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే . ఇక రాష్ట్రపతి పాలన అమలులో ఉండగానే శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటుండగానే ...  శనివారం తెల్లవారుజామున  ఎన్సీపీ చీలికవర్గం తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి  అవకాశాన్ని కల్పించి కోష్యారి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు .

 

కోష్యారి నిర్ణయం పై శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం , సుప్రీం ... బీజేపీ , ఎన్సీపీ చీలికవర్గం ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించడం చకచకా జరిగిపోయాయి . బలనిరూపణ కు ముందే , తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరైన బలం లేదన్న కారణంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవి రాజీనామా చేశారు . ఈ పూర్తి ఎపిసోడ్ లో బీజేపీ కి కోష్యారి  అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శల నేపధ్యం లో ఆయన పై వేటు వేసి చేతులు దులుపుకోవాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: