తెలుగుచిత్రసీమలో అత్యంత వివాదాస్పద దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మనే. ఒకప్పుడు మంచి సినిమాలు తెలుగుచిత్రసీమకు అందించిన వర్మ...ఇప్పుడు వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఆయన ఏ సినిమా తీసిన వివాదమే ఉంటుంది. అయితే ఆ వివాదాలతోనే సినిమా పబ్లిసిటీ కూడా వచ్చేలా చేస్తారు. కాకపోతే ఆయన తీసే సినిమాలకు వివాదాల వల్ల పబ్లిసిటీ వచ్చిన బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికలపడుతూనే ఉన్నాయి.

 

అంటే ఆయన సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం కాకుండా సినిమా ఎంత వివాదం అయిందా అనే విషయాన్ని ఎక్కువ పట్టించుకుంటారేమో. అందుకే ఆయన సినిమా ఏది సరిగా ఆడటం లేదు. ఇటీవల ఆయన తీసిన వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు వివాదాల్లో హిట్ అయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా చతికలపడ్డాయి. అవి ఫ్లాప్ అయిన ఏ మాత్రం తగ్గకుండా మరో వివాదాస్పద సినిమాతో ముందుకొచ్చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తెరకెక్కించారు.

 

ఈ సినిమాకు వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ..సిద్ధార్థ్ తాతోలు అనే దర్శకుడితో సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లని బట్టి చూస్తే ఇందులో చంద్రబాబు-లోకేశ్ లని బాగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయాక వారి పరిస్తితి ఎలా ఉంది. జగన్ హవా ఎలా నడుస్తోంది. అలాగే హత్యరాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది క్లియర్ గా చూపించారు.

 

ప్రస్తుతం ట్రైలర్ వరకు చూస్తే అంతా చంద్రబాబు-లోకేశ్ లని టార్గెట్ చేసి ఉందని అనిపిస్తుంది. కానీ వర్మ ట్రైలర్ అలా చూపించిన సినిమాలో వేరే కోణాలు తీసుకొస్తారు. ఇలాగే వంగవీటి సినిమా విషయంలో కూడా చేశారు. మొదట వంగవీటి సినిమా అంటే వంగవీటి రంగా వర్గానికి అనుకూలంగానే ఉంటుందని అంతా అనుకున్నారు. ట్రైలర్లు కూడా అలాగే నడిచాయి. తీరా సినిమా వచ్చేసరికి చివరిలో దేవినేని వర్గాన్ని హైలైట్ చేసినట్లు కనిపించింది. దీంతో వంగవీటి వర్గం వర్మపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

 

ఇప్పుడు కూడా బాబు-లోకేశ్ లని టార్గెట్ చేసిన చివరికి జగన్ పైకి కాంట్రవర్సీ తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. అక్కడక్కడ ట్రైలర్ లో సి‌బి‌ఐ కేసు, పదవికి రాజీనామా అంటూ కొన్ని చూపించారు. ఇవన్నీ చూస్తుంటే చివరికి వర్మ ఎవరిని నెగిటివ్ చేస్తారో తెలియ‌క టీడీపీలో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. అంటే ట్రైలర్ చూసి వర్మ సినిమాని నమ్మలేం. కాబట్టి సినిమా వచ్చాక వర్మ ఎవరిని ఫూల్ చేశారో అర్ధమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: