దేశంలో జరుగుతున్న కొన్ని అత్యాచార ఘటనలు చూస్తే ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి అంటేనే భయపడే విధంగా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకూ కూడా అత్యాచారాలకు గురవుతున్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేదు అనేది ఇక్కడే స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కర్కశత్వంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మనుషుల్లో మార్పు మాత్రం రావడం లేదు అనేది వాస్తవం.

 

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా...  మగాళ్ళు మృగంలా ప్రవర్తిస్తూ తమ కోరికలను తీర్చుకుంటున్నారు అనేది వాస్తవం. అసలు దీనికి కారణం ఏంటి...? ప్రధానంగా వినపడుతున్న పధం పోర్నో గ్రఫీ... దీని ప్రభావం ఎక్కువగా మగాళ్ళ మీద పడుతుందని అంటున్నారు. వారిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు. మొబైల్ ఫోన్ అందరికి అందుబాటులోకి రావడంతో కొందరు... పోర్న్ వీడియోలు చూసి తమలో ఉన్న కోరికలను పెంచుకుంటున్నారు.

 

అక్కడ చూసి వాటిని ఇక్కడ చెయ్యాలనే ఆలోచనతో ఉంటూ... దొరికిన వారిపై తమ వాంఛ తీర్చుకుంటున్నారు మగాళ్ళు...  విదేశీ సంస్కృతిలో ఉన్న శృంగారం కూడా వారి మీద ఎక్కువ ప్రభావం చూపించి పెడదారి పట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దేశంలో ఇప్పుడు దీని ప్రభావంతో ఎందరో అత్యాచారాలకు గురవుతున్నారు. ముక్కుపచ్చలు ఆరని చిన్న పిల్లలు బలైపోతున్నారు అనేది వాస్తవం. దీనిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

 

పోర్న్ సైట్ల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడం మినహా లాభ౦ లేదని అంటున్నారు. ఇప్పటికే విదేశీ సంస్కృతి భారిన పడి ఎందరో చిన్నారుల జీవితాలు నాశనం అయ్యాయి. చాలా మంది ఈ సైట్లు ప‌దే ప‌దే చూసేందుకు అల‌వాటు ప‌డ‌డంతో వారిలో నిగూడంగా ఉన్న కోరిక‌లు అణుచుకోలేక చిన్నారుల‌పై సైతం అకృత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ పోర్న్ సైట్లు ఆపేందుకు ప్రత్యేక చట్టాలు తెచ్చి నిరోధించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: