టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ అలవాటు ఉంది. ఆయనకు చెప్పింది ఏదైనా పదే పదే చెప్పడం అలవాటు. ఆయన చెప్పే విషయంలో వాస్తవం ఉన్నా లేకపోయిన పదే పదే చెప్పడం వల్ల ప్రజలు అదే నమ్ముతారని అనుకుంటారు. అయితే ఇది రాజకీయ వ్యూహంలో ఓ భాగమే. ఇది ఒకప్పుడు బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు వర్కౌట్ కావడం కష్టం. పైగా పైగా పదే పదే ఒకే మాట చెప్పడం వల్ల ప్రజల్లో కూడా చులకన అయిపోతున్నారు.

 

గత కొంతకాలంగా ఇలాగే జరుగుతుంది. చంద్రబాబు అనేకసార్లు జగన్ కేసులు గురించి విమర్శిస్తూనే వచ్చారు. మొదట్లో కొంతవరకు దీనిపై పాజిటివ్ గా ఉన్నా...రాను రాను నెగిటివ్ అయిపోయారు. అలాగే జగన్ పై కోడి కత్తి దాడి జరిగినప్పుడు కూడా దాని గురించే పదే పదే మాట్లాడారు. దాని వల్ల జగన్ కు నష్టం జరగకపోగా లాభం జరిగింది. అది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఎన్నికల్లో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కేసుని ఎన్నిసార్లు మాట్లాడారో లెక్కలేదు.

 

జగనే సొంత బాబాయిని చంపించాడు అని మాట్లాడారు. దీనిని కూడా ప్రజలు నమ్మలేదు.  ఈ విషయం ఎన్నికల్లో తేటతెల్లం అయిన బాబు మాత్రం మారలేదు. జిల్లా జిల్లాలు తిరుగుతూ పార్టీ సమీక్షా సమావేశాలో పాల్గొంటున్న బాబు...అదే మాటని రిపీట్ చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా పర్యటనకు వెళ్ళిన బాబు...వివేకానంద రెడ్డి హత్య విషయంపై మళ్ళీ మాట్లాడారు. వివేకానంద హత్య కేసులో ఇంటి దొంగలే ఉన్నారని, వారిని జగన్ కాపాడుతున్నారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రజలు బాబుని అసహ్యించుకునే వరకు వెళ్లిపోయింది.

 

ఆఖరికి సొంత పార్టీ నేతలు కూడా పోలీసు దర్యాప్తు జరుగుతున్న కేసులో బాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల పంచాయితీ అనడం వల్ల కడప టీడీపీ నేతలు చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వివేకానంద హత్య కేసులో మాట్లాడటం వల్ల మరికొందరు జంప్ అయిపోయే అవకాశముంది. అలాగే ఈ మాటల ప్రభావం వల్ల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బొక్క బోర్లా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: