ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలుసిందే.  ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయిన  వెనుకాడకాడటం లేదు  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ పొరుగు  రాష్ట్రాల ప్రజలకు సైతం ఆదర్శంగా  నిలిచేలా  పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలెవరూ మద్యపానం బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన దిశగా అడుగులు వేశారు. 

 

 

 

 

 అయితే దీనికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని బెల్టుషాపులు అన్నింటిని మూసి  వేయించి ప్రభుత్వమే మద్యం షాపులు నడుపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం ధరలు భారీగా పెంచారు ముఖ్యమంత్రి జగన్.ఇక మద్యం షాపుల  సమయాన్ని కూడా కుదించి  మందుబాబులకు భారీ షాక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత బార్ల సంఖ్యను కూడా కుదించి లైసెన్స్ లను కూడా తక్కువ చేసారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక అటు మద్యం విక్రయాలు విషయంలో కూడా ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేసింది జగన్ సర్కార్ . సగటు వ్యక్తి కి కేవలం మూడు బీరు బాటిల్ లు మాత్రమే కలిగి ఉండేలా  నిబంధనలు విధించింది. 

 

 

 

మద్యం నిషేధం పై  తాజాగా క్యాబినెట్ తో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రిటైల్ మద్యం షాపుల్లో  ఒక వ్యక్తికి ఒక మద్యం బాటిల్ మాత్రమే అమ్మాలని...దీనికి సంబందించిన నిబంధన  మార్చాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే మద్యాన్ని  విపరీతంగా కంట్రోల్ చేస్తే టూరిజం తగ్గే అవకాశం ఉందని.. మంత్రి అవంతి శ్రీనివాస్ అనగా టూరిజం కోసం కాదు  సమాజం కోసం ఆలోచించాలని జగన్ అన్నారు. మద్యం ధరలు భారీగా పెరిగిన పర్లేదు కస్టమర్లు మద్యం తాగడం తగ్గిస్తారని జగన్ అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: