రాష్ట్రంలో లైంగిక దాడులు పెరుగుతున్నాయి. అన్నెంపుణ్యం ఎరుగుని పసివాళ్లను కూడా మృగాళ్లు వదలడం లేదు. లైంగిక దాడులతో పాటు ఇళల్లో వచ్చే తగాదాలకు కూడా పసివాళ్లే బలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెల్లోలనే ఇలాంటి ఘటనలు జరిగాయి. వరుస ఘటనలపై సీఎం జగన్ దృష్టి సారించారు. చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

 

ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ... రేపిస్టులకు ఆ ఆలోచన వస్తేనే భయపడిపోయేలా కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడేలా చట్టాలు ఉండాలన్నారు. చట్టాన్ని అనుసరిస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని సమావేశంలో చర్చించామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రులు సుచరిత, తానేటి వనిత హాజరయ్యారు.

 

 

బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న నేరస్తుల్లో మానసిక పరివర్తన రావాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ..చిన్నారులపై దాడులు బాధాకరమన్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపొందిస్తున్నామన్నారు. సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 

 

నేరస్తుల్లోనూ మానసిక పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అన్నారు. తెలిసిన వారి ద్వారానే బాలికలపై నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. మనల్ని ఏ దృష్టితో మన చుట్టు ఉన్న వారు చూస్తున్నారన్న అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. లైంగిక హింసకు గురికావడం బాధాకరమన్నారు. చెడు వైపు నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

 

బాలికలపై ఎందుకు అత్యాచారాలు పెరుగుతున్నాయన్నది చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు అరికట్టడానికి పోలీసులతో పాటు ఎన్‌జీవోల సహకారం కోరుతున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: