శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ ఊహించలేదు.  శివసేన భావజాలం పూర్తిగా వేరు.  ఆ పార్టీ ఎలాంటి భావజాలంతో ఉంటుందో అందరికి తెలిసిందే.  శివసేన పూర్తిగా హిందుత్వ భావజాలంతో ఉంటుంది.  ఆ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా హిందూవుల మనోభావాలకు దగ్గరగా ఉంటాయి.  కానీ, శివసేన ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది.  
శివసేనలో నరనరాన హిందూత్వ భావజాలం ఉన్న నేతలు చాలామంది ఉన్నారు.  వారంతా అదే భావజాలంతో ప్రజల్లోకి వెళ్లేవారు.  వెళ్ళినవారు.  ఇప్పుడు అలాంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి మాటలు వినిపిస్తాయో తెలిసిందే.  అధికారం కోసం హిందుత్వ భావాలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీతో కలిసింది అని అంటారు.  మైనారిటీలో తక్కువగా చేసి చూస్తారు.  ఇదే భయం శివసేన నేతలకు పట్టుకుంది.  ఈ భయంతోనే శివసేన నేతలు కొంతమంది భయపడుతున్నారు.  
భావజాలాని విరుద్దముగా పనులు చేయలేని వ్యక్తులు కొందరు ఆ పార్టీ నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు.  ఇందులో భాగంగానే భారతీయ విద్యార్థి సేవ, యువసేన విభాగాల్లో కీలక పాత్ర పోషించిన రమేష్ సోలంకి శివసేన పార్టీకి రాజీనామా చేశారు.  రమేష్ సోలంకి గత 21 సంవత్సరాలుగా శివసేనతో ఉంటున్నారు.  శివసేన పార్టీతో కలిసి ఉంటున్న ఈ నేత కాంగ్రెస్ పార్టీతో శివసేన కలవడం ఇష్టం లేక రాజీనామా చేశారు.  
ఇదే బాటలో మరికొంతమంది కూడా బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.  శివసేన పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం తగదని శివసేన నేతలు అంటున్నారు.  అసలు శివసేన పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.  కానీ, అధికారం కోసం ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అంటే.. తన కన్నును తానే పొడుచుకోవడం అని చాలామంది విమర్శిస్తున్నారు.  శివసేన పార్టీ నుంచి బయటకు వచ్చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: