మనం ఎంత టెక్నాలజీ కనిపెట్టిన కొన్నింటి విషయంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు.  అలాంటి వాటిల్లో ఒకటి భూకంపం.  భూకంపం రాబోతుందని గుర్తించే పరికరాలను ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.  అయితే, సహజసిద్ధంగా ఈ తెలివి మనుషుల కంటే కూడా పశువులు, పక్షులకు ఎక్కువగా ఉంటుంది.  భూకంపం వచ్చే ముందు పశువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి.  పక్షులు ఎక్కువగా అరుస్తూ పరుగులు తీస్తుంటాయి.  
ఇలాంటి సంఘటనలు బట్టి భూకంపం రాబోతుందని ముందుగానే కొంతవరకు గుర్తించవచ్చు.  అయితే, నిత్యం వాటిని కనిపెడుతూ ఉండాలి.  భూకంపం వచ్చిన తరువాత సిస్మోగ్రాఫ్ పై దీని గురించి రికార్డ్ అవుతుంది.  అలా రికార్డయిన దాన్ని బట్టి భూకంప తీవ్రతను అంచనా వేస్తారు.  ఇదిలా ఉంటె, ఆఫ్రికాఖండంలోని అల్బేనియాభూకంపం వచ్చింది.  ఇది 6.4 గా నమోదైంది.  అల్బేనియా రాజధాని తీరాన నగరంలో రావడంతో ప్రజలు భయబ్రాంతులయ్యారు.  
సముద్రానికి చేరువలో ఉండటంతో పాటుగా భూమిలోని ప్లేట్ లెట్స్ కు అల్బేనియా దగ్గరగా ఉండటంతో.. ఈ దేశంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.  అయితే, వీటి తీవ్రత పెద్దగా ఉండదు.  1920లో వచ్చిన భూకంపం దాటికి దాదాపుగా 200 మంది మరణించారు.  ఆ తరువాత ఇప్పుడు వచ్చిన భూకంపం ధాటికి ఇప్పటి వరకు 35 మంది మరణించిగా చాలామంది గాయపడ్డారు.  
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  భూకంపం వచ్చిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది.  భూకంపం వచ్చిన ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నారు. నగరంలోని ఇల్లు నేలమట్టం అయ్యాయి. శిధిలాలను తొలగిస్తున్నారు.  శిధిలాల కింద ప్రాణాలతో ఉన్న వాళ్ళను రక్షించి హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ భారీ నష్టం జరిగింది. భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్లను నిర్మించాలని చూస్తున్న అక్కడి ఆర్ధిక వ్యవస్థ సహకరించడం లేదు అన్నది వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: