2014 నుంచి దేశంలో నమో మాట మారుమ్రోగిపోతున్నది. ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా ఇదే మాట.  ఈ మాట ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  2014 నుంచి ఇప్పటి వరకు నమో అనే పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది.  అయితే, నమో పాలనలో అవినీతికి ఏమాత్రం చోటు ఉండదు అనే సంగతి తెలిసిందే.  మోడీ ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటారు. మోడీ పాలనలో ప్రతి ఒక్కటి స్వచ్చంగా ఉండాలని కోరుకుంటారు.  
అంతేకాదు, మోడీ ప్రభుత్వం దేశానికీ మొదట ప్రాధాన్యత ఇస్తుంది.  ఆ తరువాత మిగతా వాటికీ ప్రాధాన్యత.  దేశరక్షణ కోసం ఎంతకైనా సరే తెగిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  జగన్ ఎలాంటి పాలన చేస్తున్నారు.  ఎలా చేస్తున్నారు అనే విషయాలను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంటారు.  అయితే, మోడీ పాలనలో అక్కడక్కడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సిన్సియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఉదంతాన్నిచూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. 1991 బ్యాచ్ కు చెందిన అయన  ఇప్పటివరకూ 50 సార్లు మాత్రమే బదిలీ అయ్యారు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే.  బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో అయన ఎక్కువ సార్లు అనేక శాఖలకు బదిలీ అవుతున్నారు. ఎక్కడా కూడా ఆయన్ను ఒకచోట స్టాండ్ గా ఉండనివ్వడం లేదు.  
అయితే, మోడీ ప్రభుత్వంలో అనేక మంది నిజాయితీ అధికారులకు సముచిత స్తానం కలిపిస్తూ.. వారికీ చేదోడు వాదోడుగా ఉంటోంది. కానీ, అశోక్ విషయంలో మాత్రం బీజేపీ సర్కార్ ఎందుకు ఇలా చేస్తోందో ఎవరికి అర్ధం కావడం లేదు.  ఈ ఏడాది మార్చిలోనే హర్యానా రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసిన ఆయన్ను మరోసారి బదిలీ వేటు వేశారు. తాజాగా ఆయన్ను రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియం విభాగ ముఖ్య కార్యదర్శిగా ట్రాన్సఫర్ చేశారు.  ఇలా వరసగా బదిలీ చేస్తుండటంతో అయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: