తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపించి  ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన 26 డిమాండ్లను పరిష్కరించకుంటే ఆర్టీసీ కార్మికులను సమ్మెలోకి దింపి ఆ తర్వాత యాభై రెండు రోజులపాటు సమ్మె కొనసాగిన తరువాత ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని సమ్మె విరమించి  ఆర్టిసి కార్మికులు నట్టేట ముంచారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి. అయితే ఆర్టీసి సమ్మె విరమించినప్పటికీ అటు  ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం పై స్పందించలేదు. అటు ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో లేబర్ కోర్టులలో కూడా  న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బ తగిలింది.

 

 


 ఈ నేపథ్యంలో సమ్మె విరమించిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కూడా అశ్వద్ధామ రెడ్డి పై విమర్శలు చేయడంతో అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులను డిమాండ్ల పరిష్కారం పేరుతో సమ్మెలోకి దింపి  ఎలాంటి డిమాండ్లు పరిష్కారం కాకుండానే  సమ్మెను విరమించిన దానికి బాధ్యతగా  తన పదవికి  అశ్వత్థామరెడ్డి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటూ చర్చ మొదలైంది. అయితే అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి రాజీనామా చేసి అనంతరం కార్మికులకు విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. అయితే సమ్మెను ముందుండి నడిపించిన అశ్వత్థామరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని  అంతేకాకుండా ఏకపక్షంగా సమ్మెను  నడిపించి  ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మార్చారంటూ  అశ్వద్ధామ రెడ్డిపై విమర్శలు రావడం కూడా  ఆయనను  మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం.

 


 సమ్మె విరమణ తర్వాత ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాత్రం మీడియా ముందు  ఎక్కడా కనిపించలేదు. అంతే కాకుండా అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలోని 5,100 రూట్లను  ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకుంది  ప్రభుత్వం. అటు హైకోర్టులో కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ కు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో... నేడు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ విఆర్ఎస్, కేఆర్ఎస్ స్కీం లను కూడా ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా  కెసిఆర్ తీర్పుపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వస్తున్న వేళ చివరికి కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుతం ఉత్కంఠగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: