అమరావతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఉదయం బాబు పర్యటిస్తున్నారు అని తెలియగానే పెద్ద ఎత్తున అక్కడికి బాబు అనుకూల వర్గం.. వ్యతిరేక వర్గం ప్రజలు చేరుకున్నారు.  బాబును అక్కడి రైతులు అడుగడుగునా అడ్డగించారు.  అమరావతిలో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం బాబే అని చాలామంది రైతులు నిరసనలు చేయడంతో దీనిపై బాబు స్పందించారు.  
రైతులు చెప్పినట్టుగా రాజధాని విషయంలో తానూ తప్పు చేసి ఉంటె బహిరంగ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.  తాను అవినీతికి పాల్పడి ఉంటె.. దానిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  చర్యలు తీసుకొని విచారణ జరపాలని అన్నారు.  అంతేకాని, రాజధానిని నిర్మాణం ఆపెయ్యడం సరికాదని చెప్పారు.  రాజధాని విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికి బలంగా నమ్ముతున్నానని బాబు అంటున్నారు.  
అమరావతిని ప్రపంచంలో టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిర్మించాలని కల కన్నట్టు చెప్పారు.  ఎప్పటికైనా తానే అమరావతిని నిర్మిస్తానని, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటిగా నిర్మిస్తానని అంటున్నారు.  హైదరాబాద్ నగరం తన వలనే అభివృద్ధి జరిగిందని అమరావతి కూడా అలానే జరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పారు.  అధికారంలో ఉన్న నేతలు తమ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని బాబు పేర్కొన్నారు.  
అమరావతి విషయంలో తాను అవినీతికి పాల్పడితే.. గత ఆరు నెలలుగా వైకాపా కూడా అదే చేస్తోందని, రైతులు 33 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం ఇస్తే.. దానిని పక్కన పెట్టి ఇలా మాట్లాడటం సరికాదని బాబు చెప్పారు. అమరావతి స్మశానం అని వైకాపా మంత్రులు చెప్పడం వెనుక వారి ఉద్దేశ్యాలు ఏమిటో వారికే తెలియాలని అన్నారు.  తాను వస్తున్నాని తెలిసి తనపై దాడి చేయిస్తున్నారని, అయినా సరే అమరావతి అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని బాబు ఈ సందర్భంగా తెలియజేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: