ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడూ చంద్రబాబు నాయుడిని రైతులు మాకిచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు రైతులను బెదిరించి భూములను లాక్కున్నారని బుగ్గన చెప్పారు. ప్రపంచానికి చూపించిన నగరమేమీ వాస్తవానికి అక్కడ చూపించిన నగరమేమీ అని ఒక వీడియోను బుగ్గన రాజేంద్రనాథ్ ప్రదర్శించి చూపించారు. 
 
గ్రాఫిక్స్ చూపించి చూపించి 90 శాతం అమరావతి పూర్తయినట్లుగా తెలుగుదేశం చిత్రీకరిస్తుందని బుగ్గన చెప్పారు. హాలీవుడ్ లో ఉన్న స్టీవ్ బర్గ్ లాంటి వాళ్లు కూడా ఇంత మంచి గ్రాఫిక్స్ చేయలేరని బుగ్గన చెప్పారు. రాజధానిలో ఎక్కడ చూసిన అరటి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయని బుగ్గన చెప్పారు. గత ఐదేళ్లలో అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. 
 
ఐదేళ్లు చంద్రబాబు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపారని బుగ్గన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అంటారని వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిద్రపోయారా...? అని బుగ్గన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అమరావతికి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదని బుగ్గన ప్రశ్నించారు. 
 
చంద్రబాబు చెప్పిన దానికి చేసిన దానికి పొంతన లేదని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబు..? అని బుగ్గన ప్రశ్నించారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టి 52,000 కోట్లకు టెండర్లు పిలుస్తారా...? అని బుగ్గన ప్రశ్నించారు. రాజధాని టెండర్లలో అవకతవకలు జరిగాయని బుగ్గన చెప్పారు. వైజాగ్ లో చంద్రబాబు కబడ్డీ మ్యాచ్ చూసి ఒలింపిక్స్ తెస్తా అన్నారని క్రికెట్ చూస్తే ఇంకేం చెప్పేవారో అని బుగ్గన అన్నారు. ఎందుకు చంద్రబాబు వైజాగ్ ను అభివృద్ధి చేయలేదని బుగ్గన ప్రశ్నించారు. ఏపీలో ఐటీ సంస్థలకు అనుకూలంగా ఉండే ప్రాంతాలు వైజాగ్, అనంతపురం అని ఎందుకు చంద్రబాబు ఆ జిల్లాలను అభివృద్ధి చేయలేదని బుగ్గన చంద్రబాబును ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: