ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఈ భావన ఎక్కువగా బలపడుతుంది. సాధారణంగా రాజకీయాల్లో ఉండే వాళ్లకు ఓపికతో పాటు దూకుడు కూడా చాలా అవసరం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దూకుడు లేకపోతే మాత్రం తీసుకునే నిర్ణయాలు ఒక్కో సారి ఇబ్బంది పెట్టె అవకాశం కూడా ఉంటాయి. వాస్తవంగా మాట్లాడితే చంద్రబాబు చాల ఒపికగా ఉంటారు అనేది వాస్తవం.

 

తన వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆయన చాలా వరకు ఓర్పుగానే వ్యవహరిస్తారు. కాని జగన్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సీట్ల ఎంపిక ప్రక్రియ నుంచి రాజకీయ నిర్ణయాల వరకు ప్రతీ ఒక్కటి కూడా జగన్ లో దూకుడు స్పష్టంగా కనపడుతుంది. ఆయన చంద్రబాబులా ఎవరిని బుజ్జగించే రకం కూడా కాదు. అందుకే ఆ పార్టీ నేడు ఆ స్థితిలో ఉందని అంటున్నారు పరిశీలకులు తెలుగుదేశం నేతలు. ఇప్పుడు సంక్షేమ పథకాలు గాని, రాజకీయ౦గా తీసుకునే కొన్ని నిర్ణయాలు గాని జగన్ ముఖ్యమంత్రి హోదాలో చాలా దూకుడుగా తీసుకుంటున్నారు.

 

ఇక ఆయన ఆ పార్టీలో సుప్రీం గా ఉంటారు... ఎవరికి ఏ సమాధానం చెప్పే అవసరం కూడా లేదు. ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే విషయంలో ఆయన అసంతృప్తులు వచ్చినా సరే ఎవరికి నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఇప్పుడు ఆయన గనుక సంక్షేమ పథకాలు అన్ని విజయవంతంగా అమలు చేసి... ఒక్కసారి గేట్లు తెరిచి దూకుడుగా నేతలను ఆహ్వానించడం మొదలుపెడితే చంద్రబాబుకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం ఉండదు అనే ఆందోళన తెలుగుదేశం నేతల్లో ఎక్కువగా ఉంది అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు పార్టీని జగన్ ని ఎదుర్కుని ఏ విధంగా చంద్రబాబు కాపాడ‌తారు అనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: