‘గాలొస్తుంది కదా అని డోర్లు ఓపెన్ చేస్తే దాంతో పాటే దుమ్ము కూడా వస్తుంది..’ ఇది ఓ సినిమా డైలాగ్. టెక్నాలజీ డెవలెప్ మెంట్ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది పలు విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసే వారు మరీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 

 

బలమైన పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం.. ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ను సేవ్ చేసుకోకుండా ఉండటం మేలు. అంకెలు, అక్షరాలు, సింబల్స్ ను ఉపయోగిస్తూ పాస్ వర్డ్స్ ను పటిష్టంగా సెట్ చేసుకోవడం ఉత్తమం. ఫోన్, ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్‌లలో సాఫ్ట్ వేర్ ను అప్డేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. సైబర్ హ్యాకర్స్ మీ సాఫ్ట్ వేర్ లోని లోపాలను పసిగట్టి మీ సిస్టమ్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్స్ చేసుకుంటూ ఉంటే సమస్య ఉండదు. ఒకవేళ అప్‌డేట్ చేసుకోకపోతే సైబర్ క్రిమినల్స్ మీ సిస్టమ్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్ లైన్ బ్రౌజింగ్ లో మీ సెషన్ సెక్యూర్‌గా ఉందో లేదో చూడండి.

 

 

షాపింగ్ చేసే సమయంలో యూఆర్‌ఎల్ ‘https’తో స్టార్ట్ అవుతుంతో లేదో చూసుకోవాలి. లేదంటే బ్రౌజర్ బార్‌లో లాక్‌డ్ పాడ్‌లాక్ సింబల్ కనిపిస్తుందోమో గమనించండి. ఇలా ఉంటే మీ డేటా సురక్షితమేనని భావించాలి. మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అధికారిక బ్యాంకింగ్ యాప్స్‌ ను వాడటమే బెటర్. ఫోన్లకు వచ్చే మెసేజ్‌లో లింక్‌లను క్లిక్ చేయద్దు. ఫైల్స్ అటాచ్‌మెంట్ ఉంటే కూడా డౌన్‌లోడ్ చేయోద్దు. దీనివల్ల మీ పర్సనల్ డిటైల్స్ కు ప్రమాదం. 

 

 

మీకు తెలిసిన సైట్లను మాత్రమే ఉపయోగించడం బెటర్. స్పెల్లింగ్ లేదా గ్రామర్ లోపాలను చూసి ఫేక్ వెబ్‌సైట్లను గుర్తు పట్టొచ్చు. రియల్‌టైమ్ ప్రొటెక్షన్ అందించే సెక్యూరిటీ షూట్‌లను ఉపయోగించండి. దీంతో మీ ప్రైవేట్, ఫైనాన్షియల్ డేటాకు భద్రత లభిస్తుంది. ఐడెంటిటీ థెఫ్ట్ నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించండి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన సైట్లను మాత్రమే ఉపయోగించడం, సెక్యూ్ర్డ్ నెట్‌వర్క్ ఉపయోగిస్తే మంచిది. ఐడీ థెఫ్ట్ అలర్ట్ ను సెట్ చేసుకోండి. ఈఎంవీ చిప్ ఉన్న డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మీ డేటాకు అదనపు లేయర్ ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: