మహారాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ అధిష్టానం గౌరవించాలని, రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతినకుండా చూసుకోవాలని శివసేన అన్నారు.గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ ఠాక్రేకు ఇచ్చిన వాగ్దానాలను తెలియజేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. మోడీ గతంలో సేన అధ్యక్షుడైన థాకరేను తన "తమ్ముడు" అని పేర్కొన్నాడు.ముఖ్యమంత్రి పదవిని భ్రమణ ప్రాతిపదికన రాష్ట్రంలో పంచుకోవడంపై శివసేన, మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాలు మహారాష్ట్రలో తీవ్రతరం అయ్యాయి. సేన బిజెపితో దశాబ్దాల నాటి సంబంధాలను విడదీసుకొని, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్సీపీ, కాంగ్రెసలను కలిపి సంకీర్ణాన్ని ప్రభుత్వాని ఏర్పాటు చేసింది.

 

"మహారాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే కి అభినందనలు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన శ్రద్ధగా పని చేస్తారని నాకు నమ్మకం ఉంది" అని ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాని ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన శివసేన మోడీని "మా ప్రధానమంత్రి" అని పేర్కొంది అలాగే ఠాక్రే నాయకత్వంలో మహారాష్ట్ర వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నారు. "దాని కోసం కేంద్రం సహకరించాలి. మహారాష్ట్ర రైతులను వారి కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి కేంద్రం సహాయం చేయాల్సి ఉంటుంది" అని శివసేన అన్నారు.

 


"మహారాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ గౌరవించాలి మరియు రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతినకుండా చూసుకోవాలి" అని శివసేన తెలిపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో మహారాష్ట్ర మట్టి శౌర్యం నిండి ఉంది దాని సృష్టి కోసం రాష్ట్ర ప్రజలు ఢిల్లీతో పోరాడారని శివసేన తెలిపింది.

 

అక్టోబర్ 24 న అసెంబ్లీ పోల్ ఫలితాలను ప్రకటించిన తరువాత రూపుదిద్దుకున్న మూడు ప్రధాన బిజెపియేతర పార్టీల మధ్య కుదిరిన కూటమి అయిన మహా వికాస్ అగాది పాలక సంకీర్ణానికి ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు.విభిన్న భావజాలాలను కలిగి ఉన్నప్పటికీ, సేన, కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి ఒక సాధారణ  కార్యక్రమాన్ని రూపొందించాయి, దానికి ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వ చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: