తానూ అనుకున్నది సాధించే వరకు వదలని పట్టు  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఇదే విషయం మనం  ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం లో చూసాము .. తాజాగా ఆర్టీసీ కార్మికుల  సమ్మెఫై   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు  గురించి తెలిసిందే. ఆయన  కేంద్రం అనుమతి లేనిదే  ఆర్టీసీని రద్దు చేయలేరు అని  కీలక వాక్యాలు చేసారు .. ఆర్టీసీలో  కేంద్రం కి కూడా  వాటా ఉందని చెప్పటం తెలిసిందే.

 

తాజాగా గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన జరిపిన ప్రెస్ మీట్ లో కేంద్రంపై   మండిపడ్డాడు . ఆర్టీసీలో కేంద్రం వాటా లెక్కలు  ఎంతో తేలుస్తానని ఆయన అన్నారు . అప్పుడెప్పుడో ఏదో రూ.10.. రూ.50 రూపాయిలు ఇచ్చి పొత్తు కలిశారని.. ఉమ్మడి ఏపీలోనూ.. తెలంగాణలోనూ ఆర్టీసీకి పైసా కూడా ఇవ్వలేదు అంటూ ఆయన కేంద్రం తీరుఫైమండిపడ్డాడు  ..

 

ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడులు లెక్కలు వేస్తె కేంద్రం  నికి సంబందించిన వాటా  31 శాతానికి రూ.22వేల కోట్లుగా బయటపడింది అని .. ఈ విషయంఫై   కేంద్రానికి తాము నోటీసులు ఇస్తామని చెబుతున్నారు. కేంద్రం పైన తాము కచ్ఛితంగా కోర్టుకు వెళ్లి తీరతాం అంటున్నారు . కేంద్రం వాటా ఉంది కాబట్టి రూ.5వేల కోట్లు ఇవ్వమంటే  ఇస్తారా? అంటూ  కేంద్రం ఫై ఆయన మండిపడ్డారు ఇప్పుడు ఆయన మాటలుసంచలనంగా మారాయి.

 

కేంద్రంతో తేల్చుకుంటామని చెబుతున్న కేసీఆర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆయన అడిగిన  ప్రశ్నలకు జవాబు  చెప్పాల్సిన అవసరం  కేంద్రం కి ఉంది అన్నారు . ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందన్న నితిన్ గడ్కరీ మాటల నేపథ్యంలో.. దాని లెక్కలఫై కేంద్రంతో  పోరుకు కేసీఆర్ సిద్ధం  అవుతున్నట్లేఉన్నట్లు ఉంది  చుస్తే పరిస్థితి .. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: