బీజేపీకి పార్లమెంట్ లో ఫుల్ మెజారిటీ ఉన్నది.  దాపుగా 305 మంది ఎంపీలు ఉన్నారు.  సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అయినప్పటికీ మిత్రపక్షాలకు చోటు ఇచ్చి వారికీ సముచిత స్థానం కల్పించింది బీజేపీ.  అయితే, బీజేపీలో కొంత మంది ఎంపీలు మొరటుగా ప్రవర్తిస్తుంటారు.  మొరటుగా ప్రవర్తించడంతో పాటు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో.. బీజేపీ ఇరకాటంలో పడుతున్నది.  సొంత ఎంపీలే ఇలా మాట్లాడుతుంటే.. మిగతా వారు ఎందుకు మాట్లాడరు చెప్పండి.  
అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వారిపై కొన్నిసార్లు కఠువుగా చర్యలు తీసుకోవాల్సి వస్తున్నది.  ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి పార్లమెంట్ లో జరిగింది.  మధ్యప్రదేశ్ భోపాల్ ఎంపీ సాద్వి ప్రజ్ఞాసింగ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  ఎవరి గురించో చేస్తే పెద్దగా పర్వాలేదు.  కానీ, గాంధీ గురించి వ్యాఖ్యలు చేసింది.  గాంధీని చంపిన గాడ్సే గురించి వ్యాఖ్యలు చేసింది.  
గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడని.. హీరో అని పొగిడింది.  దీంతో సభలోని ప్రతి ఒక్కరు సాద్వి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు.  ఇటు బీజేపీ నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఎదురైంది.  వెంటనే సాద్విని రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి తొలగించారు.  ఇదే విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు.  ఇక ఇదిలా ఉంటె, గాంధీ గురించి తప్పుగా మాట్లాడిన సాద్విని చంపుతానని మధ్యప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే అంటున్నాడు.  
మధ్యప్రదేశ్ లోని బయోరాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఢంగి ఈ వ్యాఖ్యలు చేశారు.  గాడ్సేను హీరోగా చేసి పార్లమెంట్ లో మాట్లాడిన ప్రజ్ఞాసింగ్ భోపాల్ లో అడుగుపడితే సజీవ దహనం చేస్తానని అంటున్నారు.  ఒక పార్లమెంట్ ఎంపీని పట్టుకొని ఇలా నడిరోడ్డులో మాట్లాడటం తప్పుకాదా అంటే తప్పేమి కాదని, గాడ్సే గురించి ఆమె పార్లమెంట్ లో ఎలా మాడ్లాడుతుందని అన్నారు.  ఆమె మధ్యప్రదేశ్ లో అడుగుపెడితే చంపుతానని పదేపదే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడం విశేషం.  నిజంగానే ఎమ్మెల్యే అలా చేస్తారంటారా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: