ఉమ్మడి ఆంధ్ర నుండి ఎనో దీక్షలు చేసి ఎంతో  పోరాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి అనేది  లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గర్వాంగా చెప్పుకున్నారు..  అవినీతిని నిర్ములన మాతో నే సాధ్యం అంటూ చెప్పుకొచ్చారు .ఈ విషయం ఫై   ప్రధాని మోడీ కూడా  కెసిఆర్  ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

 

ప్రభుత్వంలో అవినీతి ఎంతన్నది పక్కన పెడితే తాజాగా ఇండియా కరప్షన్ 2019 పేరుతో ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో 2018 అక్టోబరు నుంచి నవంబరు 2019 వరకు అవినీతి ఫై సర్వే నిర్వహించారు. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది స్థానిక ప్రజలు.. సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ  ర్యాంకుల్ని నిర్ణయించారు.

 

ఎవరి ఊహ కు అందని  విధంగా తెలంగాణలో దారుణంగా అవినీతి ఉందన్న విషయం ఈ సర్వే పేర్కొంది. తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. రాష్టం లో 67 శాతం అవినీతి ఉందని.. నూటికి 67 శాతం మంది ప్రజలు తమ పనులు పూర్తీ కావడం కోసం అధికారులకు లంచాలు ఇవ్వవల్సిందే అని అంటున్నారు .

 

దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగారాజస్థాన్ మొదటి స్తానం లో నిలవగా .. రెండో స్థానంలో బిహార్.. మూడో స్థానంలో జార్ఖండ్ నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ.. మునిసిపల్.. పోలీసు శాఖల్లో అత్యధిక అవినీతి ఉందన్న విషయం బయటకు వచ్చింది. తెలంగాణలో భూదస్త్రాల ప్రక్షాళన తర్వాత  మరింత అవినీతి పెరిగింది  అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి 

 

తెలంగాణలో లంచం ఇచ్చిన 67 శాతం మందిలో 56 శాతం మంది రెండుఅంత  కంటే ఎక్కువసార్లు లంచం ఇచ్చినట్లు  గుర్తించారు. కొందరు ప్రత్యక్షంగా అధికారులకే ఇవ్వగా.. మరికొందరు పరోక్షంగా చెల్లింపులు జరిపారు. 40 శాతం రిజిస్ట్రేషన్లు.. భూముల పనుల కోసం లంచం ఇచ్చినట్లు గ సర్వే లో వెల్లడయింది. గత ఏడాదిలో లంచాలు ఇచ్చామని చెప్పిన వారి శాతం 43 కాగా.. ఈ ఏడాది అది  67 శాతానికి పెరిగినట్లుగా చెప్తున్నారు 

 

అవినీతిలో రాష్ట్రాల ర్యాంకింగ్ లో తెలంగాణ ఐదో స్థానంలో ఏంటే.. ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం 13వ స్థానం దక్కింది . ఏపీలో అవినీతి 50 శాతంగా ఉందని తేల్చారు. ఇక.. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాల్లో కేరళ నిలిచింది. అక్కడ అవినీతి కేవలం 10 శాతంగా తేల్చారు. కేరళ తర్వాత అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాలుగా గోవా (20).. ఒడిశా (40).. ఢిల్లీ (46) గాసర్వే తేల్చి చెప్పింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: