ఇటీవల ఆంధ్రాలో బార్ల దుకాణాల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఐతే ఇప్పుడు ఏపీ సర్కార్ నూతన బార్ల లైసెన్సులకు సంబంధించి తాజాగా  గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది. ఈ లైసెన్స్ లు 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు పని చేయడం జరుగుతుంది  అని సర్కార్  తెలియచేయడం జరిగింది. 

 

Image result for bar shops in andhra
 

 ఇక గెజిట్ నోటిఫికేషన్ లో వివరాల గురించి తెలుసుకుందామా మరి.... 2020 జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.

 

Image result for bar shops in andhra
 

ఇక కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే  రూ. 4లక్షల 50 వేలు. ఒక వేళా  మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఐతే ఫీజు 2 లక్షలుగా నిర్దారణ చేసినట్లు తెలుస్తుంది.  ఇక  విజయవాడ, విశాఖలో  విషయానికి వస్తే మాత్రం దరఖాస్తు ఫీజు రూ.7 లక్షలుగా నిర్దారణ చేసినట్లు వెల్లడించడం జరిగింది.


 
 ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా నిర్దారించిన ఆంధ్ర ప్రదేశ్  సర్కార్  ప్రభుత్వం. ఈ గెజిట్ నోటిఫికేషన్  నేటి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది అని అధికారులు వెల్లడించారు. ఇక ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు అని సమాచారం కూడా ఉంది. ఇక  డిసెంబర్ 7న రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా కూడా విడుదల చేస్తారు అని జగన్ సర్కార్ తెలియచేయడం జరిగింది.
 
-

మరింత సమాచారం తెలుసుకోండి: