ఐదేళ్ల పాటు ఆకాశంలో మబ్బులు చూపించి.. అభివృద్ధి చేశాము అంటి  గొప్పలు  చెప్పుకున్న ఆరు నెలల కాలంలోనే దూది పింజల్లా తేలిపోతున్నాయి అని బాగా తెలుస్తుంది. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి యువత భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చేసిన పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ప్రతి ఒక్క పేద, మధ్య తరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా చేయూతనందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి ప్రభుత్వం విలువైన పథకాల్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=STUDENTS' target='_blank' title='students-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>students</a> in andhra

 

వాస్తవానికి ప్రభుత్వ మంటే సమాజాన్ని అభివృద్ధి చేసే నిర్ణయాలు తీసుకునేలా పనిచెయ్యాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి నిరూపించుకోవడం జరిగింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఈ పథకాలతో రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా విద్యా ఫలితాలను అందుకోబోతున్నారు.

 

100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌... వృత్తి విద్యసహా ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఫీజులను పూర్తిస్థాయిలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేసిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాది జూలై 23న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

 

2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల ఫీజులపై జీవో 38 విడుదల కూడా చేయడం జరిగింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మాడీ, ఫార్మాడీ(పీబీ), బీఆర్క్, బీ.ఫార్మా, ఎం.ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2018–19 విద్యాసంవత్సరానికి అమలు చేసిన ఫీజులే 2019–20 విద్యా సంవత్సరానికి కూడా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో తెలియచేయడం జరిగింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు నిజంగా ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: