ఒకే ఒక ఘోర ఓటమి టీడీపీ భవిష్యత్తునే తలకిందులు చేసేసింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలనుకున్న టీడీపీకి 2019 ఎన్నికలు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఈ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది. ఓ వైపు చంద్రబాబు సత్తా తగ్గిపోవడం, మరోవైపు లోకేశ్ అసమర్ధత కారణంగా టీడీపీకి భవిష్యత్తు లేదని పలువురు నేతలు వైసీపీ, బీజేపీల్లోకి వెళ్లిపోతున్నారు. సరే జరిగిందేదో జరిగిందని చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టాలని చూస్తున్న అది సాధ్యం కావడం లేదు.

 

రోజు రోజుకు టీడీపీ పరిస్తితి దిగజారుతుందే తప్ప మెరుగు పడటం లేదు. పైగా ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు ఏం చేసిన వర్కౌట్ కావడం లేదు.  బాబు ఎలాంటి కార్యక్రమం చేపట్టిన దానికి ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచే మద్ధతు కరువైపోయింది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. జగన్ అధికార పీఠం ఎక్కగానే బాబు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

 

అలాగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. మొదట టీడీపీ బాధితలు పేరిట గుంటూరు పార్టీ కార్యాలయంలో ఓ శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే వారిని సొంత వూరికి పంపడంలో భాగంగా ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీన్ని పోలీసులు మొదట్లోనే ఆపేసి ఫెయిల్ చేశారు. ఇక తర్వాత అన్నా క్యాంటీన్ల మూసివేత, ఇసుక కొరతపై వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. అలాగే సొంత పార్టీ నేతలు కూడా పెద్దగా పాల్గొనలేదు. ఇటీవల ఇసుక దీక్ష పెట్టిన అది విజయవంతం కాలేదు. ఇక తాజాగా అమరావతి పర్యటన కూడా ఫెయిల్ అవ్వడమే కాక ఎదురు రైతుల నుంచి నిరసన ఎదురైంది. అయితే ఇలా బాబు ఏం చేసిన ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. గత ఐదేళ్లు అధికారంలో ఉండి ఏ హామీ నెరవేర్చకుండా బాబు తమని ఇబ్బంది పెట్టారని ప్రజలు భావిస్తున్నారు.

 

అలాగే ఇప్పుడు ఆర్ధిక పరిస్తితి బాగోకపోయిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. దీంతో జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అందుకే బాబు ఏ కార్యక్రమం చేపట్టిన ఫెయిల్ అవుతుంది. పైగా ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా ఇలా ఆందోళనలు చేయడంతో ప్రజలు బాబుని అసహ్యించుకునే స్థాయికి వచ్చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: