ప్రియాంక రెడ్డి హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రియాంక తల్లిదండ్రులు, సోదరి, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులైన మహ్మద్ షాషా, నవీన్, చెన్నకేశవులు, శివను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. 
 
నిందితులు ప్రియాంకరెడ్డికి మద్యం తాగించి అత్యాచారం చేశారు. ప్రియాంక రెడ్డి హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచినప్పటికీ వాహనాల శబ్దం వలన ప్రియాంక రెడ్డి వేదన ఎవరికీ వినపడలేదు. దాదాపు 45 నిమిషాల పాటు నిందితులు ప్రియాంకపై అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. నిందితులు ప్రియాంక నోరు, ముక్కు మూసేయడంతో ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. 
 
ప్రియాంక చనిపోయిన తరువాత ప్రియాంక మృతదేహంపై కూడా నిందితులు దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. నిందితులు లారీ క్యాబిన్ లోకి ప్రియాంక మృతదేహాన్ని ప్యాంటు లేకుండానే ఎక్కించారు. నిందితులు మృతదేహంపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిందితుల్లో ఒకడు ప్యాంటు తెచ్చి తొడిగినట్లు సమాచారం. నిందితుల్లో మైనర్ ఉన్నాడని వార్తలు వస్తున్నా ఆ వార్తలు నిజం కాదని తెలుస్తోంది. 
 
ప్రియాంక మృతదేహం కాలిపోవటంతో కొన్ని కీలకమైన ఆధారాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలంటే టీఐడీ పరేడ్ కీలకం కానుంది. నిందితులు సరైన ఆధారాలు దొరకకుండా ఘాతుకానికి పాల్పడ్డారు. టీఐడీ పరేడ్ లో భాగంగా సాక్ష్యులు తాము చూసిన వారిలో నిందితుడు ఉంటే తాము చూసింది అతనినేనని వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. నిందితులకు శిక్ష పడేలా చేయాలని అప్పుడే ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రియాంక తండ్రి కోరుతున్నారు. పోలీసులు ఘటనాస్థలిలో మృతురాలి చెప్పులు, పర్సు, లో దుస్తులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ 30 సంవత్సరాలలోపు వారే కావడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: