ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆరునెల‌ల కాలం పూర్తి చేసుకున్నారు. నేటితో ఆరు నెల‌ల పాల‌న పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత ఈ స‌మ‌యంలో ఏం చేశారు? అన్న వ‌స్తున్నాడు అని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌...ఆ మేర‌కు ప్ర‌జ‌ల్లో ఆనందం నింపాడా అనే ఆస‌క్తి ఉంది. జ‌గ‌న్ ఏలుబ‌డిలో ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డిన కొన్ని ముఖ్య ప‌థ‌కాలు, నిర్ణ‌యాలివి


*******అవినీతిపై యుద్ధం **********
– అవినీతి నిర్మూలనతో పేదలకు, సామాన్యులకు లబ్ధి
–అవినీతి లేని సుపరిపాలన కోసం.. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం. 
– అహ్మదాబాద్‌ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం.
– రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. 
– ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి.. చర్యలు.  
– ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పిస్తారు. 
– ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు వివక్షకు, అవినీతికి తావులేకుండా  పారదర్శక విధానంలో అందరికీ అందుబాటు.
– గతంలో ఏ పని కావాలన్నా మండల కార్యాలయాలకు ప్రజలు వెళ్లేవారు. అక్కడకు వెళ్తే పనులు కాని పరిస్థితులు వల్ల అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు ఆస్కారం ఏర్పడేది. 
– అందుకనే అధికార వికేంద్రీకరణ,  గ్రామాలకు అందుబాటులో పాలనను తీసుకురావడం, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించడానికి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారు. జనవరి 1 నుంచి సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం..

*********స్పందన *****
– ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం.
– ఎప్పటిలోగా సమస్య పరిష్కరిస్తారో సూచిస్తూ ప్రతి అర్జీకి రశీదు తప్పనిసరి.
– ప్రతి వారం ‘స్పందన’ అమలు తీరుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష .
– అర్జీదారులు సంతృప్తి చెందేలా వ్యవహరించాలని సీఎం ఆదేశం.

*******వైఎస్సార్‌ వాహన మిత్ర *******
– ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. 
– ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.  
– ఇప్పటి వరకు రూ.236 కోట్లతో 2,36,343 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం.   

*****వైఎస్సార్‌ కంటి వెలుగు ****
తేదీః 10.10.2019
వేదికః అనంతపురంలో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌
– రాష్ట్రంలోని 5.4 కోట్ల ప్రజలకు వివిధ దశల్లో ఉచితంగా కంటి పరీక్షలు అవసరమైన వారికి శస్త్రచికిత్స, కళ్లద్దాల పంపిణీ.
ఇందు కోసం వచ్చే రెండున్నర ఏళ్లలో రూ.560 కోట్ల వ్యయం.తొలి, మలి దశల్లో విద్యార్థులకు కంటి పరీక్ష.
 – తొలి విడతగా సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. రెండవ విడతలో వీరిలో అవసరమైన వారికి చికిత్స చేయించి, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. 
 – ఆ తర్వాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలవుతాయి. 
– తొలి దశలో అక్టోబరు 10 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 62,489 స్కూళ్లలో 70.42 లక్షల విద్యార్థులకు సుశిక్షితులైన 60 వేల సిబ్బందితో కంటి పరీక్షలు.
– రెండో దశలో మిగిలిన అన్ని స్కూళ్లలో నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు 400 బృందాలతో కంటి పరీక్షలు. 
2020 ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వా, తాతలతో సహా ప్రజలందరికీ మూడు నుంచి ఆరు దశల్లో కంటి పరీక్షలు. ఒక్కో దశలో కోటి మందికి కంటి వైద్య పరీక్షలు. 

 

*****వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ****
– ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే సహాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. తద్వారా రాష్ట్రంలోని 
1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి. 
– మర పడవల నిర్వాహకులకు ఇస్తున్న డీజిల్‌ రాయితీ లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంపు. ఇంజను కలిగిన తెప్పలకూ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ.
– సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. కొత్తగా మూడు ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు. ముమ్మిడివరంలో చమురు నిక్షేపాల అన్వేషణలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం చెల్లింపు. 


******వైఎస్సార్‌ కాపు నేస్తం*****
– ఈ పథకం కింద తొలి ఏడాది రూ. 1,101 కోట్లు కేటాయింపు.
– 45 ఏళ్లు దాటిన కాపు మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల సహాయం.
***వైయస్‌ఆర్‌ నవశకం***
–వైయస్‌ఆర్‌ నవశకం పేరుతో డిసెంబరు నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతుంది.
–  ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తారు. 
– జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల ఆర్థిక సాయం.. అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, 
నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 
–బియ్యం కొత్త కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం
– అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో బియ్యం కార్డులు జారీ 
– బియ్యంకార్డుల జారీకోసం నిబంధనలను సడలించిన ప్రభుత్వం
– 2008 తర్వాత అర్హతలను మళ్లీ సమీక్షించలేదని, సమీక్ష చేయాలంటూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
 ఆమేరకు సడలించిన ప్రభుత్వం
– గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. 
– తాజాగా ప్రభుత్వం దీన్ని సడలిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు. 
– గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది. 

******* అగ్రిగోల్డ్‌****
తేదీః నవంబరు 7, 2019
వేదికః గుంటూరు
– దేశంలోనే తొలిసారిగా.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ బారిన పడి మోసపోయిన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం సాయం చేసింది.
– గత  ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోకపోవడంతో దాదాపు 350 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 
– అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే.. తొలి బడ్జెట్‌ సమావేశాల్లో రూ. 1150 కోట్లు కేటాయించారు.
– తొలి విడతగా రూ. 10 వేల లోపు డిపాజిట్‌ దారులకు 3.70 లక్షల మందికి రూ. 264 కోట్లు పంపిణీ చేశాం. 
 – రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం అందిస్తారు. ఇందు కోసం త్వరలోనే రూ.811 కోట్లు విడుదల. 
******* రివర్స్‌ టెండరింగ్‌: న్యాయ సమీక్ష****
– ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో అవినీతికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ.. అన్నింటా రివర్స్‌ టెండరింగ్‌ విధానం. 
రూ. 100 కోట్లు దాటిన ప్రతి పనిపై న్యాయ సమీక్ష
– రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఆయా ప్రాజెక్టుల్లో దాదాపు రూ.1500 కోట్లు వరకూ ప్రజాధనం ఆదా
– పోలవరంలోనే రూ. 1000 కోట్ల వరకు ఆదా. 
– జెన్‌ కో బొగ్గు రవాణా లో రూ. 186 కోట్లు
–డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోలులో రూ. 65.47 కోట్లు
–జెన్‌ కో బొగ్గు పర్యవేక్షణలో రూ. 25 కోట్లు
–4జీ సిమ్‌ కార్డులు పోస్ట్‌ పెయిడ్‌ లో రూ. 33.77 కోట్లు
–పోతురాజు నాలా డ్రైన్‌ అభివృద్ధిలో రూ. 15.62 కోట్లు
–ఇళ్ళ నిర్మాణంలో రూ. 105.91 కోట్లు

******వేతనాల పెంపు*******
– ప్రభుత్వం ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచింది. 
– ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. 
– మున్సిపాల్టీల్లో  పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతం  రూ. 18 వేలకు పెంపు
–బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు. 
–హోం గార్డులకు రూ.18వేల నుంచి  రూ.21 వేలకు పెంపు.  
– వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు.  
–108 పైలెట్‌(డ్రైవర్‌)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచారు.
–  104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచారు.  
–మధ్యాహ్నభోజన కార్మిలకు నెలకు రూ.1000నుంచి రూ.3 వేలు జీతం పెంచుతూ నిర్ణయం
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌

******** పేదలకు నాణ్యమైన బియ్యం***
తేదీః 06.09.2019
వేదికః శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్యక్రమం. బహిరంగ సభ
– పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంతో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం.
– శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా 5, 10, 15, 20 కిలోల సంచుల్లో బియ్యం పంపిణీ ప్రారంభం
– నాణ్యత పెంచిన, తినగలిగిన బియ్యం రేషన్‌ షాపుల ద్వారా సరఫరా.
– గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పేద ప్రజల ఇంటి వద్దనే పంపిణీ. 
– నాణ్యత కలిగిన నిత్యావసర సరుకుల సరఫరా. 

*** కొత్త ఇసుక పాలసీ ***
– గత ప్రభుత్వ పెద్దల దోపిడీ తీరుకు భిన్నంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీ అమలు. 
– ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల ఏర్పాటు. 
– ఇసుక వారోత్సవంలో రూ.60 కోట్లు ఆదాయం.

*****వైఎస్సార్‌ నవోదయం****
తేదీః 17.10.2019
వేదికః అమరావతిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌
– లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి. 
– గత ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వీటినిఆదుకోవడానికి ఈ పథకం ప్రారంభం. 80 వేల ఎంఎస్‌ఎంఈలకు ఊరట.    
– సంక్షోభంలో ఉన్న సంస్థల పునరుద్ధరణతో పాటు, వాటి స్థిరీకరణలో తోడ్పాటు అందించడం పథకం లక్ష్యం.
– ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ’ (ఎంఎస్‌ఎంఈ), రుణాల ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ (ఓటీఆర్‌).
– ఈ పథకం కోసం రూ.10 కోట్లు విడుదల 

****బాక్సైట్‌ కు నో****
తేదీః 25.06.2019
విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గారి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ

****‘వైయస్సార్‌ రైతు దినోత్సవం’***
తేదీః 08.07.2019
వేదికః వైయస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులో బహిరంగ సభలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌.
– వైయస్సార్‌ జయంతి జులై 8ను వైయస్‌ఆర్‌ రైతు దినోత్సవంగా అమలు
–‘రైతే రాజుగా రాజన్న రాజ్యం–వ్యవసాయ ప్రగతి ప్రభుత్వ లక్ష్యం’ పేరుతో కార్యక్రమాన్నిప్రారంభించిన ప్రభుత్వం.

 

****స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు***

తేదీః 19.07.2019
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ముసాయిదా బిల్లుకు ఆమోదం

****పోలీసులకు వీక్లీ ఆఫ్ *****
– పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్‌ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం
******‘వన మహోత్సవం’****
తేదీః 31.08.2019
వేదికః గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు, పేరెచర్లలో మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించిన  ముఖ్యమంత్రి
– ఈ ఒక్క సీజన్‌లోనే 4 కోట్ల మొక్కలు నాటగా, వన మహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించిన సీఎం.
– మొక్కల పెంపకం కార్యక్రమంలో పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు మొక్కలు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధం
– మరో 13 కోట్ల మొక్కలను పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖతో పాటు, పేపర్‌ మిల్లులు మొక్కలు నాటనున్నాయని సభలో వివరించిన ముఖ్యమంత్రి.
*****‘వైయస్సార్‌ సంపూర్ణ పోషక పథకం’***
తేదీః 26.11.2019

వేదికః అమరావతిలోని సచివాలయంలో ఉత్తర్వులు జారీ
–రాష్ట్రంలోని ఏడు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండలాల్లో పథకం అమలు
– ప్రస్తుతం అమలులో ఉన్న పోషక ఆహార పథకాన్ని పరిశీలించి మహిళలు, పిల్లలకు మరింత పోషకాహారం అందించడం లక్ష్యం
– పథకానికి సంబంధించి 8 జిల్లాల అధికారులకు మార్గదర్శకాలు
–ఎస్సీలు, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంపు

****రోల్డ్‌ గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్లకు కరెంటు ఛార్జీలు తగ్గింపు***
- ఆయా కంపెనీలకు యూనిట్‌ విద్యుత్‌ రేటు రూ.9.20 నుంచి రూ.375కు తగ్గింపు
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దాదాపు 250 రోల్డ్‌ గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్లకు ప్రయోజనం
– ఆయా కంపెనీల నుంచి తక్కువ విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఎదురయ్యే నష్టాలను పూడ్చేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ ఇంధన శాఖ సబ్సిడీ విడుదల చేస్తుంది. 

***** ఫీజు మానిటరింగ్‌ కమిటీలు****
– రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై.. మానిటరింగ్‌ కమిటీల ఏర్పాటు
– తద్వారా ఫీజుల నియంత్రణకు చర్యలు

మరింత సమాచారం తెలుసుకోండి: